AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. అద్భుత కళాఖండం.. చెర్రీ, తారక్ నటనకు గూస్‌బంప్స్ ఖాయమంటున్న ఉమర్

RRR First Review: దక్షిణాది మెగా మల్టీస్టారర్ మూవీ.. పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్..

RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. అద్భుత కళాఖండం.. చెర్రీ, తారక్ నటనకు గూస్‌బంప్స్ ఖాయమంటున్న ఉమర్
Rrr First Rivew
Surya Kala
|

Updated on: Mar 24, 2022 | 5:24 PM

Share

RRR First Review: దక్షిణాది మెగా మల్టీస్టారర్ మూవీ.. పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం, మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినీ అభిమానులతో పాటు, మెగా, నందమూరి అభిమానులు సినిమా కోసం అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కొన్ని థియేటర్స్ వద్ద అభిమానుల సందడి మొదలైంది. అయితే తాజాగా UK, UAE సెన్సార్ బోర్డ్‌లో మెంబర్‌ ఉమైర్ సంధు మొదటి సమీక్షను అందించాడు. ఆర్ఆర్ఆర్ రాజమౌళి యొక్క అద్భుత కళాఖండమని చెప్పారు. ఈ సినిమాకు ఫైవ్ రేటింగ్ ను ఇచ్చాడు.

ఉమైర్ తన ట్విట్టర్ వేదికగా.. “సెన్సార్ బోర్డ్ నుండి ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ. రామ్ చరణ్  అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చరణ్ చాలా అద్భుతంగా నటించాడు. ఇక తారక్, చరణ్ కాంబినేషన్ లో సన్నివేశాలు చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. అజయ్ దేవగన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు.  ఆలియాభట్ అందంగా ఉందన్నాడు.

అంతేకాదు ఉమర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇప్పటి వరకూ చూడని కొన్ని గ్లింప్‌లను కూడా పంచుకున్నాడు. ఉమైర్ సంధు ఈ చిత్రంలో హీరో ఎన్టీఆర్ , రామ్ చరణ్‌లపై ప్రశంసలు కురిపించారు.

Rrr Umar

Rrr Umar

ఈ ఫిల్మ్ క్రిటిక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇలా వ్రాశాడు, “RRR సినిమా భారతీయ చలనచిత్ర నిర్మాత భారీ సినిమాలను తెరకెక్కించవచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాదు.. ఈ సినిమాను మిస్ చేసుకోవద్దు..  ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అని అంటారు. రేపు ఆర్ఆర్ఆర్ మూవీ క్లాసిక్‌గా గుర్తుండిపోతుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్ ల నటన ఓ రేంజ్ లో ఉంది. ఎప్పటికీ గుర్తుండి పోతుందని చెప్పాడు.

భారీ బడ్జెట్ తో DVV ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై DVV దానయ్య తెలుగు-భాష హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా చిత్రాన్ని నిర్మించారు. మార్చి 25, 2022న విడుదల కానుంది. డాల్బీ సినిమాలో రిలీజ్ కానున్న మొదటి భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్.

ప్రధాన తారలు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ,అజయ్ దేవగన్, అలియా భట్ , ఒలివియా మోరిస్ కీలక పాత్రలు పోషిస్తుండగా, సముద్రఖని, రే స్టీవెన్సన్ , అలియా డూడీ సహాయక పాత్రలు పోషించారు.

PEN స్టూడియోస్‌కి చెందిన జయంతి లాల్ గడా ఉత్తర భారతదేశంలో థియేటర్ పంపిణీ హక్కులతో పాటు అన్ని భాషలలో అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ హక్కులను కూడా పొందింది. ఈ చిత్రాన్ని పెన్ మరుధర్ ఉత్తర ప్రాంతంలో పంపిణీ చేయనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లు ZEE5లో అందుబాటులో ఉంటాయి. ఇక హిందీ, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్ , స్పానిష్ భాషలలో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

Also Read:

Telangana: తెలంగాణలో చేపలను ఎగుమతి చేసే కంపెనీ భారీ పెట్టుబడి.. సుమారు 5000 మందికి ఉపాధికి అవకాశాలు

అమ్మాయిల కలల హీరో.. ఛాన్స్‌లు తగ్గిన తర్వాత కూలీ.. ఈ హీరో జీవితం పడిలేచిన కెరటం

వేలానికి ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో ఫోటో.. వెయ్యికోట్లకు పైగా పలుకుతుందని అంచనా