Marilyn Monroe: వేలానికి ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో ఫోటో.. వెయ్యికోట్లకు పైగా పలుకుతుందని అంచనా
Marilyn Monroe: అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ.. రవి వర్మ(Ravi Varma)కే అందని అందం.. యువతకు కలల సుందరి.. ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్(World Fashion Icon) మార్లిన్ మన్రో. ఆమె నవ్వితే..
Marilyn Monroe: అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ.. రవి వర్మ(Ravi Varma)కే అందని అందం.. యువతకు కలల సుందరి.. ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్(World Fashion Icon) మార్లిన్ మన్రో. ఆమె నవ్వితే హాలీవుడ్(Hollywood) నవ్వింది. ఏడిస్తే ఏడ్చింది. కొంటె చూపు చూస్తే మెలికలు తిరిగి సిగ్గుపడింది. అనాధగా తినడానికి తిండి లేని స్టేజ్ నుంచి లెక్కకు అందని సిరిసంపదలను, ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. కానీ అవసరానికి మించి జీవితంలో వచ్చిన సిరిసంపదలను, పేరు ప్రఖ్యాతలు తట్టుకోలేకపోయింది.. చిన్న వయసులోనే జీవిత ప్రయాణాన్ని ముగించుకుంది. అందుకనే జీవితంలో ఎలా ఉండాలో మన్రోని చూసి నేర్చుకోవాలి.. అదే సమయంలో ఎలా ఉండకూడదో కూడా ఆమెనే చూసే నేర్చుకోవాలి.
ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో. అలనాటి ప్రఖ్యాత హాలీవుడ్ నటి, మోడల్, గాయని మార్లిన్ మన్రో.. మన్రో వాడిన ప్రతీ వస్తువు వేలం పెట్టగా..భారీ ధరకు అమ్ముడుపోతూనే ఉన్నాయి. తాజాగా మార్లిన్ చిత్రాన్ని క్రిస్టీ సంస్థ మే నెలలో వేలానికి పెట్టనుంది. పాప్ గాయకుడు ఆండీ వార్హోల్ గీసిన ఈ అరుదైన చిత్రం 1వెయ్యి 521 కోట్లు పలుకుతుందని అంచనా. అదే జరిగితే 20వ శతాబ్దంలోనే అతి ఖరీదైన చిత్రంగా చరిత్రలో నిలుస్తుందని క్రిస్టీ తెలిపింది.
హలీవుడ్‌లో బాగా ప్రాచుర్యం పొందిన జూలియన్స్ ఆక్షన్స్ సంస్థ ప్రముఖ తారలు వాడిన వస్తువులను వేలానికి పెడుతుంటుంది. ఇప్పటివరకు మన్రో వాడిన వస్తువులను వేలానికి పెట్టారు. ఇటీవలే మరికొన్ని మన్రో వస్తువులను వేలానికి పెట్టారు. వీటిలో మన్రో మాజీ భర్త జో డిమాగ్గియో ఆమెకు రాసిన ప్రేమలేఖ, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ఆర్థర్ మిల్లర్ రాసిన ప్రేమలేఖ కూడా ఉన్నాయి. డిమాగ్గియో రాసిన ప్రేమలేఖ దాదాపు 48 లక్షలు సాధించగా, ఆర్థర్ రాసిన ప్రేమలేఖ 28 లక్షలకు అమ్ముడుపోయింది.