AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Hero: అమ్మాయిల కలల హీరో.. ఛాన్స్‌లు తగ్గిన తర్వాత కూలీ.. ఈ హీరో జీవితం పడిలేచిన కెరటం

Star Hero: సినీ వినీలాకాశంలో ధ్రువతారలా వెలిగిపోవాలని.. కొన్ని కోట్ల మంది గుండెలు ఆరాధించే నటుడిగా నిలిచిపోవాలని ఎన్నెన్నో కలలు కంటూ.. వెండి తెరపై అడుగు పెట్టాలని కోరుకునేవారు..

Star Hero: అమ్మాయిల కలల హీరో.. ఛాన్స్‌లు తగ్గిన తర్వాత కూలీ.. ఈ హీరో జీవితం పడిలేచిన కెరటం
Prema Desam Abbas
Surya Kala
|

Updated on: Mar 24, 2022 | 4:38 PM

Share

Star Hero: సినీ వినీలాకాశంలో ధ్రువతారలా వెలిగిపోవాలని.. కొన్ని కోట్ల మంది గుండెలు ఆరాధించే నటుడిగా నిలిచిపోవాలని ఎన్నెన్నో కలలు కంటూ.. వెండి తెరపై అడుగు పెట్టాలని కోరుకునేవారు ఎందరో ఉన్నారు. కొందరు.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. తమదైన శైలి సృష్టించుకుని స్టార్ నటీనటులుగా ఎదుగుతారు. అయితే మరికొందరు నటీనటులు.. పడిలేచే కెరటంలా.. హిట్ ప్లాప్ లను, ఒత్తిడిని పరాజయాన్ని అన్నిటి తట్టుకుంటూ.. కెరీర్ ను కొనసాగిస్తారు. ఇంకొందరు.. ఎగసి పడిన కెరటంలా.. తమకు వచ్చిన ఫేమ్ ని, అభిమానాన్ని తక్కువ సమయంలో కోల్పోయి.. కెరీర్ ను , సంపాదనను కోల్పోయి అయ్యో పాపం అనిపించేలా జీవిస్తారు. అయితే ఇంకొందరు.. సినిమాల్లో వచ్చిన ఫేమ్ ను కోల్పోయినా వేరే రంగంలో కష్టపడి.. తమకంటూ మళ్ళీ ఓ కెరీర్ ను సృష్టించుకుని జీవితంలో ముందుకుసాగుతారు. అలాంటి వ్యక్తికీ ఉదాహరణగా నిలుస్తాడు ప్రేమ దేశం(Premadesham) హీరో అబ్బాస్ (Abbas). ఇతని జీవితం పడిలేచిన కెరటం..

సుమారు 25 ఏళ్ల క్రితం ప్రేమ దేశం సినిమాలో హీరోల్లో ఒకటిగా నటించిన అబ్బాస్ యూత్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అమ్మాయిలకు కలలు హీరోగా , అబ్బాయిలకు యూత్ ఐకాన్ గా మారాడు.  ఓ వైపు ప్రియురాలి ప్రేమ కోసం పరిపించే ప్రేమికుడుగా మరోవైపు స్నేహాన్ని కోరుకునే స్నేహితుడిగా    అబ్బాస్ నటన అద్భుతం అనిపించింది. అబ్బాస్ హ్యాండ్సమ్  గా రిచ్ లుక్ లో కనిపించి అదుర్స్ అనిపించాడు.  ప్రేమదేశం తర్వాత ఆ రేంజ్ లో హిట్ సినిమా మళ్ళీ అబ్బాస్ ఖాతాలో పడలేదు. తొలి సినిమాతోనే సంచలనం విజయం అందుకున్న అబ్బాస్ కెరీర్ క్రమంగా పాతాళానికి చేరుకుంది. చివరకు విలన్ గా రాజా వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించాడు.  స్టార్ హీరో గా క్రేజ్ ను సొంతం చేసుకున్న అబ్బాస్.. చివరకు బతకడానికి పెట్రోల్ బంక్ లో  కూడా పనిచేశాడు.

తెలుగులో అనేక సినిమాల్లో నటించిన అబ్బాస్ .. కెరీర్ చాలా తక్కువ సమయంలోనే ముగిపోయింది. తనకున్న టాలెంట్ ను సరిగ్గా వినియోగించుకోలేక.. సినిమాల నుంచి సైడ్ అయిపోయాడు. దీంతో బతకడానికి దేశం దాటి న్యూజిలాండ్ వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం దొరకలేదు. దీంతో మొదట్లో పెట్రోల్ బంక్ లో పనిచేశాడు. తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పనిచేశాడు. అప్పుడే అక్కడ కనస్ట్రక్షన్ పనిపై పూర్తిగా పట్టు సంపాదించాడు. మెల్లగా బిల్డర్ గా మారాడు. క్రమమా న్యూజిలాండ్ లో మంచి బిల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు. అక్కడే స్థిరపడిపోయారు. జీవితంలో సక్సెస్ కు షార్ట్ కట్స్ ఉండవు.. అదే విధంగా ఒక చోట దారులు మూసుకుపోతే.. మరొక దారి తెరుచుకుంది.. దానిని అందిపుచ్చుకుని జీవితంలో ముందుకు వెళ్లడమే ముఖ్యమని అబ్బాస్ జీవితం చుస్తే ఎవరికైనా అనిపించక మానదు.

Also Read: School Students: స్కూల్ బస్‌లో స్టూడెంట్స్ బీరు తాగి హల్ చల్.. వీడియో వైరల్.. చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు