School Students: స్కూల్ బస్‌లో స్టూడెంట్స్ బీరు తాగి హల్ చల్.. వీడియో వైరల్.. చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు

School Students: అబ్బాయిలతో అమ్మాయిలు చదువులోనూ. విద్య. ఉద్యోగాలు ఇలా  అన్ని రంగాల్లోనూ పోటీపడుతున్నారు. తమ ప్రతిభను చూపిస్తూ.. రాణిస్తున్నారు. అయితే కొంతమంది విద్యార్థినిలు..

School Students: స్కూల్ బస్‌లో స్టూడెంట్స్ బీరు తాగి హల్ చల్.. వీడియో వైరల్.. చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు
Students Drinking
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2022 | 3:23 PM

School Students: అబ్బాయిలతో అమ్మాయిలు చదువులోనూ. విద్య. ఉద్యోగాలు ఇలా  అన్ని రంగాల్లోనూ పోటీపడుతున్నారు. తమ ప్రతిభను చూపిస్తూ.. రాణిస్తున్నారు. అయితే కొంతమంది విద్యార్థినిలు తాము అబ్బాయిలకంటే ఏమి తక్కువ అనుకున్నారేమో.. స్కూల్ యూనిఫామ్ లో ఉండగానే అబ్బాయిలతో సమానంగా తాగారు. ప్రస్తుతం ఈ వీడియో తమిళనాడు(Tamilnadu) లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో స్కూల్ విద్యార్థి(School students)ని , విద్యార్థులు కలిసి ఓ బస్సులో ప్రయాణిస్తున్నారు. వీరు తిరుక‌జుకుండ్రం నుంచి థాచూర్‌కు వెళ్తున్నారు. ఆ బస్సులో కలిసి మద్యం సేవించారు. అలా తాగిన స్టూడెంట్స్ లో ఒకరు ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ వీడియోలో విద్యార్థినీ, విద్యార్థులు కలిసి..ఓ బీర్ బాటిల్‌ను ఓపెన్ చేసి.. తాగుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. వీరంతా చెంగ‌ల్‌ప‌ట్టులోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు చెందిన విద్యార్థినీ విద్యార్థుల‌ని తెలుస్తోంది. మొద‌ట్లో ఇది పాత వీడియో అని అంద‌రూ అనుకున్నారు. కానీ మంగ‌ళ‌వారం రోజే ఇది జ‌రిగింద‌ని ఆ త‌ర్వాత తెలిసింది. ఈ వీడియో చక్కర్లు కొడుతూ.. జిల్లా విద్యాధికారి వద్దకు చేరుకుంది. దీంతో ఆయన వెంటనే స్పందించారు. అధికారులు, పోలీసులు ఈ వీడియో పై ఎంక్వైరీ చేస్తున్నారని తెలిపారు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ స్టూడెంట్స్  చెంగల్‌పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా భావిస్తున్నారు.

Also Read:

తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం! టెట్‌ అర్హత జీవితకాలం.. ఆ పోస్టులకు బీఈడీ అభ్యర్థులూ అర్హులే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే