Telangana: తెలంగాణలో చేపలను ఎగుమతి చేసే కంపెనీ భారీ పెట్టుబడి.. సుమారు 5000 మందికి ఉపాధికి అవకాశాలు

Telangana: తెలంగాణాలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) బిజీబిజీగా ఉన్నారు. అమెరికా(America)లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మక కంపెనీలతో..

Telangana: తెలంగాణలో చేపలను ఎగుమతి చేసే కంపెనీ భారీ పెట్టుబడి.. సుమారు 5000 మందికి ఉపాధికి అవకాశాలు
Fishinn To Invest In Telang
Follow us

|

Updated on: Mar 24, 2022 | 4:55 PM

Telangana: తెలంగాణాలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) బిజీబిజీగా ఉన్నారు. అమెరికా(America)లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మక కంపెనీలతో సమావేశమవుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ (FishInn) తెలంగాణ లో భారీగా పెట్టుబడులను పెట్టనుంది. ఈరోజు అమెరికాలో మంత్రి కేటీఆరే తో  చైర్మన్,  సిఇఓ మనీష్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో 1000 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టం ని డెవలప్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఈ మేరకు కంపెనీ తన కార్యకలాపాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రారంభించనుంది. ఫిష్ ఇన్ కంపెనీ చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్ ,  ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని కంపెనీ సీఈఓ మనీష్ కుమార్ తెలిపారు. కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 85 వేల మెట్రిక్ టన్నుల చేపలను ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణలో భారీ పెట్టుబడిని  పెట్టనున్న ఫిష్ ఇన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడి తో రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ కి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం అంది వస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కంపెనీలో తెలంగాణ యువతకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమ పై ఆధారపడిన వారికి, మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీకి సూచించారు. చేపల పెంపకానికి సంబంధించి ఇప్పటికే వారి వద్ద ఉన్న నైపుణ్యాన్ని కంపెనీ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ కంపెనీ సీఈవో మనీష్ కి సూచించారు.

Also Read: Marilyn Monroe: వేలానికి ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో ఫోటో.. వెయ్యికోట్లకు పైగా పలుకుతుందని అంచనా

School Students: స్కూల్ బస్‌లో స్టూడెంట్స్ బీరు తాగి హల్ చల్.. వీడియో వైరల్.. చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు