AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మహిళపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటో తెలిస్తే ప్యూజులు ఎగిరిపోతాయి..!

Viral News: ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే జనాలకు చేరుతుంది.

Viral News: మహిళపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటో తెలిస్తే ప్యూజులు ఎగిరిపోతాయి..!
Dog
Shiva Prajapati
|

Updated on: Mar 25, 2022 | 8:04 AM

Share

Viral News: ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే జనాలకు చేరుతుంది. తాజాగా ఓ మహిళ చేసిన పనికి యావత్ సోషల్ మీడియా యూజర్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. అడ్డగోలుగా తిట్టిపోస్తున్నారు. ఆ తిట్లకు కారణం.. తన పెంపుడు కుక్కకు పేరు పెట్టడటమే. అవును.. మీరు విన్నది నిజమే. ఓ మహిళ తన పెంపుడు కుక్కు ‘కోవిడ్’ వైరస్ అని పేరు పెట్టింది. ఆ పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇంకేముంది.. ఆ పేరు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి లాక్ డౌన్ సమయంలో ఆ పెంపుడు కుక్క తనను సురక్షితంగా కాపాడిందట. దానికి కృతజ్ఞతగానే ఆమె తన పెంపుడు కుక్కకు ఆ పేరు పెట్టిందట.

ప్రపంచవ్యాప్తంగా ఆరు మిలియన్ల మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారి కరోనా పేరును తన కుక్కకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించింది ఆ కుక్క యజమాని. ‘‘లాక్‌డౌన్ ప్రారంభ సమయంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక కుక్కను చూశాం. దానిని చేరదీసి.. ఇంటి వెనుక పెరట్లో కట్టేసి ఫుడ్ పెట్టాము. అప్పటి నుంచి కుక్క ఆ పెరట్లోనే ఉండేది. ఎవరైనా దానిని పిలిస్తే తప్ప.. ఎక్కడికి కదిలేది కాదు. కుక్క కారణంగా ఎవరూ వచ్చేవారు కాదు. అలా కోవిడ్ సమయంలో మమ్మల్ని ఆ కుక్క కాపాడింది. ఆ కారణంగానే దీనికి ‘కోవిడ్’ అని పేరు పెట్టాము’’ అని చెప్పుకొచ్చింది.

అయితే, కుక్కకు వైరస్ పెట్టడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. అలా పెట్టడం ఏమైనా బాగుందా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. వైరస్ పేరెందుకు? ఇతర వ్యాధుల పేర్లు కూడా పెట్టేయండంటూ మరికొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Also read:

Celebrities Real Names: ఈ బాలీవుడ్‌ సూపర్‌స్టార్ల అసలు పేర్లెంటో మీకు తెలుసా?..

ఈ పువ్వు ఒక్కసారి వాడిపోతే 12 సంవత్సరాల తర్వాత వికసిస్తుంది.. భారత్‌లో మాత్రమే ఉండే ఈ పువ్వు ప్రత్యేకతలు మీకోసం..!

Child care tips: వేసవిలో మీ పిల్లలు ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ పండ్లను తినిపించండి..