Celebrities Real Names: ఈ బాలీవుడ్ సూపర్‌స్టార్ల అసలు పేర్లెంటో మీకు తెలుసా?..
బాలీవుడ్‌లో చాలా మంది స్టార్స్ ఉన్నారు, వారికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. హీరోల సినిమాలు చూడడమే కాదు కొంత మంది ఫ్యాన్స్ వారి అభిమాన హీరోల పర్సనల్ విషయాలను కూడా తెలుసుకోవాలనుకుంటారు. ఈక్రమంలో సినిమా రంగంలోకి రాకముందే తమ పేర్లను మార్చుకున్న గొప్ప నటులు బాలీవుడ్‌లో చాలానే ఉన్నారు. వారెవరో తెలుసుకుందాం రండి.
Updated on: Mar 25, 2022 | 7:55 AM

బాలీవుడ్లో స్టార్లుగా వెలుగొందుతోన్న చాలామంది నటులు తమ పేర్లను మార్చుకున్నారు.

సైఫ్ అలీఖాన్ ఇండస్ట్రీలో చోటా నవాబ్ అని కూడా పిలుస్తుంటారు. అయితే అతని అసలు పేరు సాజిద్ అలీ ఖాన్. సైఫ్ నవాబ్ కుటుంబానికి చెందినవాడు. అతను చివరిగా బంటీ ఔర్ బబ్లీ 2 చిత్రంలో కనిపించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. సినిమాల కోసం తన పేరు మార్చుకున్నాడు. అతని చిత్రం బచ్చన్ పాండే ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లు వసూలు చేసింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. అయితే బాలీవుడ్‌లోకి రాకముందు సల్మాన్ తన పేరు మార్చుకున్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అతని అసలు పేరు అబ్దుల్ రషీద్ ఖాన్. అభిమానులు అతడిని సల్లూభాయ్ అని కూడా పిలుస్తారు.

90వ దశకంలో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు మిథున్ చక్రవర్తి. తన నటనతో జాతీయ అవార్డు కూడా అందుకున్కనారు. కాగా సినిమా రంగంలోకి రాకముందు ఆయన పేరు గౌరంగ చక్రవర్తి. అభిమానులు ఆయనను మిథున్ డా అని ముద్దుగా కూడా పిలుచుకుంటారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను భారతీయ చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటుల్లో ఒకరిగా పరిగణిస్తారు . 79 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన అసలు పేరు ఇంక్విలాబ్ శ్రీవాస్తవ అని చాలా తక్కువ మందికి తెలుసు. సినిమా ఇండస్ట్రీలో ఆయన్ను బిగ్ బి అని కూడా అంటారు.




