- Telugu News Photo Gallery Child care tips give these fruits to children in the summer and boost their body strength in Telugu
Child care tips: వేసవిలో మీ పిల్లలు ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ పండ్లను తినిపించండి..
Fruits for Child: పిల్లలకు మంచి పోషకాహారం ఇవ్వాలంటే బ్రెడ్, పండ్లు తినాలి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అటువంటి పండ్ల గురించి తెలుసుకుందాం రండి.
Updated on: Mar 25, 2022 | 7:51 AM

స్ట్రాబెర్రీ: వేసవిలో పిల్లలు ఎనర్జిటిక్‌గా ఉండాలంటే స్ట్రాబెర్రీలతో తయారుచేసిన షేక్‌లు ఇవ్వాలి. ఇందులో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పరిమితంగా మాత్రమే ఇవ్వాలి.

వేసవిలో పిల్లల ఉదర సంబంధిత సమస్యలను తొలగించడంలో బొప్పాయి సమర్థంగా పనిచేస్తుంది. పైగా ఈ పండు వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే పిల్లలకు క్రమం తప్పకుండా దీనిని ఇవ్వాలంటారు ఆరోగ్య నిపుణులు.

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. విశేషమేమిటంటే దీని రుచి పిల్లలకు బాగా నచ్చుతుంది. కాబట్టి పిల్లలకు తరచుగా కొబ్బరి నీళ్లను ఇవ్వాలి.

వేసవిలో ఈ పండుకున్న ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పండులో విటమిన్ ఎ, సి, డి, ఐరన్, పొటాషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

సీజన్‌ల్ పండ్లు పిల్లలకు ఆరోగ్యంతో పాటు ఎనర్జీని అందిస్తాయి. చురుగ్గా ఉంచుతాయి.

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లలకు ఆరోగ్యంతో పాటు బలాన్ని అందిస్తుంది. అయితే వీటిని పరిమితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకోవడం వల్ల పిల్లల్లో మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది.




