నిమ్మకాయ: చర్మ సంరక్షణలో నిమ్మకాయ చాలా ఉత్తమమైనది. అండర్ ఆర్మ్స్ దుర్గంధంతో పాటు, అండర్ ఆర్మ్స్‌లో ఏర్పడే డార్క్‌నెస్‌ను కూడా తొలగిస్తుంది. ఒక టీస్పూన్ నిమ్మరసంలో అర టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను చేతుల కింద భాగంలో అప్లై చేయాలి. కాసేపటి తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.