Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Challan offer: ట్రాఫిక్ ఛలాన్ల రాయితీ ఆఫర్ కు అనూహ్య స్పందన.. ఎన్ని కోట్లు వసూలయ్యాయంటే..?

పెండింగ్ ఛలాన్లపై తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన ఆఫర్(Challan Offer) కు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చిందని హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ అన్నారు. రూ.650 కోట్లకు పైగా విలువైన...

Challan offer: ట్రాఫిక్ ఛలాన్ల రాయితీ ఆఫర్ కు అనూహ్య స్పందన.. ఎన్ని కోట్లు వసూలయ్యాయంటే..?
Traffic Challan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 25, 2022 | 1:38 PM

పెండింగ్ ఛలాన్లపై తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన ఆఫర్(Challan Offer) కు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చిందని హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ అన్నారు. రూ.650 కోట్లకు పైగా విలువైన పెండింగ్ ఛలాన్లు క్లియర్ అయ్యాయన్నారు. ఇందులో రాయితీ పోనూ రూ.190 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు కోటి 85 లక్షల ఛలాన్లు క్లియర్ అయ్యాయన్న సీపీ.. రోజుకు ఏడు నుండి పది లక్షల చలాన్ల పెండింగ్(Pending) ను చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ అవవాశం మార్చి 31 వరకు ఉందని, పెండింగ్ ఛలాన్లు ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గడుపు పొడిగింపు ఆలోచన లేదని స్పష్టం చేశారు. 15 వందల కోట్ల విలువ చేసే ఛలాన్లు పెండింగ్ ఉన్నాయని.. 60 నుండి 70 శాతం క్లియర్ అవుతాయని ఆశిస్తున్నట్లు వివరించారు.\

పెండింగ్‌లో ఉన్న ఛలాన్లపై రాయితీ ఇస్తూ తెలంగాణ పోలీసులు ఆఫర్ ప్రకటించారు. ద్విచక్రవాహనదారులకు 75శాతం డిస్కౌంట్‌ కల్పించారు. కార్లకు 50శాతం, ఆర్టీసీబస్సులకు 30శాతం, తోపుడు బండ్లకు 20శాతం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పెండింగ్‌ చలాన్లను ఆన్‌లైన్‌, మీ సేవా సెంటర్లలో చెల్లించవచ్చని తెలిపారు. హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్, రాచకొండ పరిధిలో పెండింగ్‌ చలాన్లు పేరుకుపోయినట్లు చెబుతున్నారు ఉన్నతాధికారులు. పెండింగ్ చ‌లాన్లు క్లియర్ చేసేందుకే ఈ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చామని వెల్లడించారు. వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Also Read

IPL 2022, CSK vs KKR, LIVE Streaming: ఐపీఎల్‌కు వేళాయే.. చెన్నై వర్సెస్ కోల్‌కతా మధ్య తొలిపోరు.. ఎక్కడ, ఎలా చూడాలంటే?

Viral Photo: ఈ ఫోటోలోని బుడ్డోడు ఫ్యాన్స్‌కు ఫేవరెట్ మాస్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా!

Andhra Pradesh: చెక్‌పోస్ట్ వద్ద ప్రైవేట్‌ బస్సును ఆపిన పోలీసులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా ఫ్యూజులు ఔట్!