IPL 2022, CSK vs KKR, LIVE Streaming: ఐపీఎల్‌కు వేళాయే.. చెన్నై వర్సెస్ కోల్‌కతా మధ్య తొలిపోరు.. ఎక్కడ, ఎలా చూడాలంటే?

Chennai super Kings vs Kolkata knight riders Live Streaming: IPL 2022 IPL 2022లో భాగంగా తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మార్చి 26 శనివారం జరగనుంది.

IPL 2022, CSK vs KKR, LIVE Streaming: ఐపీఎల్‌కు వేళాయే.. చెన్నై వర్సెస్ కోల్‌కతా మధ్య తొలిపోరు.. ఎక్కడ, ఎలా చూడాలంటే?
Csk Vs Kkr Ipl Match
Follow us
Venkata Chari

|

Updated on: Mar 25, 2022 | 1:30 PM

IPL 2022 ఆరంభ మ్యాచుకు కొద్ది గంటలే సమయం ఉంది. తొలి మ్యాచులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)మధ్య పోరు జరగనుంది. గత ఏడాది ఫైనల్‌లో ఈ రెండు జట్లూ ముఖాముఖిగా తలపడగా అక్కడ చెన్నై గెలిచింది. అయితే, అప్పటి జట్లతో పోల్చితే ప్రస్తుతం చాలా మార్పులు వచ్చాయి. జట్ల కెప్టెన్ నుంచి ఆటగాళ్ల వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చేతిలో ఉండగా , కేకేఆర్ కెప్టెన్సీ శ్రేయాస్ అయ్యర్ చేతిలో ఉంది.

12 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ని నడిపించిన ధోనీ.. నాలుగు టైటిళ్లు, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిపాడు. అయితే, శనివారం ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కి ముందు గురువారం ఫ్రాంచైజీ కెప్టెన్సీని విడిచిపెట్టాడు. నమ్మకస్తుడైన రవీంద్ర జడేజాకు అప్పగించారు.

సరికొత్తగా బరిలోకి..

ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన అయ్యర్‌ను గత నెలలో జరిగిన మెగా వేలంలో రూ. 12.25 కోట్లకు KKR కొనుగోలు చేసింది. KKR టీమ్ మేనేజ్‌మెంట్ ఆస్ట్రేలియన్ టెస్ట్ జట్టు కెప్టెన్ కం ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ కంటే ఎక్కువగా శ్రేయాస్‌పైనే నమ్మకముంచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15లోని మొదటి ఐదు మ్యాచ్‌లలో పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్, బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్‌ దూరమయ్యారు. అదే సమయంలో చెన్నై నుంచి ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్, మొయిన్ అలీ ఆడడం లేదు. వీసా వివాదం కారణంగా మొయిన్ అలీ ముంబైకి ఆలస్యంగా చేరుకోగా, దీపక్ చాహర్ గాయం కారణంగా NCA పునరావాసంలో ఉన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

IPL 2022లో భాగంగా తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మార్చి 26 శనివారం జరగనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

IPL 2022 మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య రాత్రి 7:30కు జరుగుతుంది. రాత్రి 7 గంటలకు టాస్‌ జరుగుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే IPL 2022 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడొచ్చు?

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవ్వనున్నాయి. అలాగే హాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య IPL 2022 మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖడే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.

Also Read: IPL 2022: వామ్మో ఇదేం బౌలింగ్‌.. బౌన్సర్లతో భయపెట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌ స్పీడ్ స్టర్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌కు షాక్‌.. ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్న ఆ స్టార్ ఆటగాళ్లు..