IPL 2022: వామ్మో ఇదేం బౌలింగ్‌.. బౌన్సర్లతో భయపెట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌ స్పీడ్ స్టర్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Sunrisers Hyderabad: గత ఐపీఎల్‌ సీజన్‌లో బాగా ఆకట్టుకున్న ఆటగాళ్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ (Umran Malik) ఒకడు. జమ్మూకు చెందిన ఈ యంగ్‌ పేసర్‌ ఐపీఎల్‌-2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరఫున అరంగేట్రం చేశాడు.

IPL 2022: వామ్మో ఇదేం బౌలింగ్‌.. బౌన్సర్లతో భయపెట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌ స్పీడ్ స్టర్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..
Umran Malik
Follow us
Basha Shek

|

Updated on: Mar 25, 2022 | 8:30 AM

Sunrisers Hyderabad: గత ఐపీఎల్‌ సీజన్‌లో బాగా ఆకట్టుకున్న ఆటగాళ్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ (Umran Malik) ఒకడు. జమ్మూకు చెందిన ఈ యంగ్‌ పేసర్‌ ఐపీఎల్‌-2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తరఫున అరంగేట్రం చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ యార్కర్‌ స్పెషలిస్ట్‌ నటరాజన్‌ కొవిడ్ బారిన పడడంతో అతని స్థానంలో చోటు దక్కించుకున్నాడు ఉమ్రాన్‌. అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా సద్వినియోగం చేసుకున్నాడు ఈ ఫాస్ట్‌ బౌలర్‌. కేవలం మూడు మ్యాచ్‌లే ఆడినప్పటికీ గంటకి 151.03 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి టాప్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. గత ఏడాది మాలిక్ కంటే వేగంగా లూకీ ఫెర్గూసన్ (151.33) మాత్రమే వేగంగా బంతిని వేయగలగడం విశేషం. ఇలా తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్‌ను ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందే రూ. 4 కోట్లకు రీటైన్‌ చేసుకుంది ఎస్‌ఆర్‌హెచ్‌ .

బుల్లెట్ లాంటి బంతులతో..

కాగా ఐపీఎల్‌-2022 కు సమయం దగ్గర పడడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రాక్టీస్‌ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇంట్రా-స్క్వాడ్ (రెండు జట్లుగా విడిపోయి)  ప్రాక్టీస్ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌన్సర్లు వేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా స్టార్‌ బ్యాటర్‌ నికోలస్ పూరన్‌కు పట్టపగలే చుక్కలు చూపించాడు. ఒక బౌన్సర్‌ని కనీసం టచ్ కూడా చేయలేకపోయిన పూరన్.. రెండో బంతిని ఫుల్ చేయబోయి నేరుగా స్వ్కేర్ లెగ్‌లోని ఫీల్డర్‌కి దొరికేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌ అవుతోంది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 సీజన్‌ ప్రారంభం కానుంది. అదే విధంగా ఎస్‌ఆర్‌హెచ్‌ మార్చి 29న తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఢీకొట్టనుంది.

Also Read:Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 63 ట్రైనీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 63 ట్రైనీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా