IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌కు షాక్‌.. ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్న ఆ స్టార్ ఆటగాళ్లు..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2022) సీజన్ ప్రారంభం కాకముందే , అన్ని జట్లూ ఒక సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే విదేశీ ఆటగాళ్ల  గైర్హాజరీ. డిఫెండింగ్‌ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ వరకు, దాదాపు ప్రతి జట్టు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌కు షాక్‌.. ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్న ఆ స్టార్ ఆటగాళ్లు..
Pujab Kings
Follow us
Basha Shek

|

Updated on: Mar 25, 2022 | 8:00 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2022) సీజన్ ప్రారంభం కాకముందే , అన్ని జట్లూ ఒక సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే విదేశీ ఆటగాళ్ల  గైర్హాజరీ. డిఫెండింగ్‌ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ వరకు, దాదాపు ప్రతి జట్టు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మొదటిసారి టైటిల్‌ గెల్చుకుందామని కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతోన్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings) పరిస్థితి కూడా అలాగే ఉంది. సౌతాఫ్రికా స్టార్‌ బౌలర్‌ కగిసో రబాడా  (Kagiso Rabada), ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ బ్యాటర్‌ (Jonny Bairstow) జానీ బెయిర్‌ స్టోలు సేవలను ఈ జట్టు కోల్పోనుంది. కాగా ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు . ఆదివారం (మార్చి 27) ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7. 30గంటలకు ఈ మ్యాచ్‌ జరగనుంది.

రెండు మ్యాచ్‌ల వరకూ..

ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. ఈ రెండు జట్ల మధ్య మూడవ, చివరి టెస్ట్ గురువారం (మార్చి 24) నుంచి గ్రెనడాలో ప్రారంభమైంది. ఈ టెస్టుతుది జట్టులో బెయిర్‌స్టో అవకాశం దక్కించుకున్నాడు. దీంతో రాబోయే ఐదు రోజుల పాటు అతను విండీస్‌లోనే ఉండనున్నాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చినా 3 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అయితే బయో బబుల్‌ నుంచే వస్తున్నాడు కాబట్టి ఈ క్వారంటైన్‌ నిబంధనలను సడలించవచ్చు. అయినా కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బెయిర్‌స్టో తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేడని తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 1న జరిగే రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది మయాంక్‌ సేన

రబాడా కూడా..

ఇక కగిసో రబడా విషయానికి వస్తే, ఈ స్పీడ్‌స్టర్‌ మార్చి 23 బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో ODIలో ఆడాడు. అయితే టెస్ట్‌ సిరీస్‌లో మాత్రం ఆడడం లేదు. అయినా మార్చి 27న జరిగే తొలి మ్యాచ్‌లో అతను ఆడడం దాదాపు అసాధ్యం. రబాడ ఇంకా భారత్‌కు చేరుకోలేదు. అయితే రెండో మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Also Read: Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..

Pariksha Pe Charcha 2022: ఏప్రిల్ 1న విద్యార్థులతో సంభాషించనున్న ప్రధాని మోడీ.. ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలనే విషయంపై సూచనలు

Boat Airdopes 411: బోట్‌ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. తక్కువ ధరల్లోనే లభ్యం

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా