Womens World Cup 2022: టీమిండియాను వెంటాడిన దురదృష్టం.. ఇక సెమీస్‌కు అర్హత సాధించాలంటే..
ICC Women World Cup 2022: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా పడుతూ లేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు (Indian Womens Cricket Team) రెండు విజయాలు, మూడు పరాజయాలతో మొత్తం 6 పాయింట్లు సొంతం చేసుకుంది.
ICC Women World Cup 2022: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా పడుతూ లేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు (Indian Womens Cricket Team) రెండు విజయాలు, మూడు పరాజయాలతో మొత్తం 6 పాయింట్లు సొంతం చేసుకుంది. ముఖ్యంగా బంగ్లామీద భారీ విజయం సాధించి సెమీస్ రేసులో నిలిచింది. అయితే గురువారం సౌతాఫ్రికా- వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. దీంతో 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో మొత్తం 9 పాయింట్లతో ప్రొటీస్ జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. విండీస్ జట్టు కూడా 7 మ్యాచ్‌ల్లో మూడు గెలుపులు, మూడు ఓటములతో 7 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. మరోవైపు పాకిస్తాన్‌పై ఘన విజయంతో ఇంగ్లండ్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో టీమిండియా 5వ స్థానానికి పడిపోయింది. దీంతో సెమీస్ చేరాలంటే ఆదివారం (మార్చి27) జరిగే ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సెమీస్‌కు చేరాలంటే..
ఆదివారం మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడిస్తే 8 పాయింట్లతో టీమిండియా మూడో స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అదే విధంగా ఇంగ్లండ్ కూడా తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాపై గెలిస్తే మూడో ప్లేస్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్, భారత్ ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లలో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్‌లో నిలుస్తాయి. ఒకవేళ అనూహ్యంగా బంగ్లా చేతిలో ఇంగ్లండ్ ఓటమి చెంది, దక్షిణాఫ్రికా చేతిలో భారత్ కూడా ఓడిపోతే రన్‌రేట్ కీలక పాత్ర పోషించనుంది. మరోవైపు న్యూజిలాండ్ శనివారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు భారీ విజయం సాధిస్తే.. భారత్, ఇంగ్లండ్ జట్లతో పాటు సెమీస్ రేసులోకి దూసుకొస్తుంది. ఏదేమైనా సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే మ్యాచ్ టీమిండియాకు చావోరేవో లాంటిది.
Which teams will claim the final two spots in #CWC22? ? pic.twitter.com/yTwNH5Xp4J
— ICC Cricket World Cup (@cricketworldcup) March 24, 2022
Also Read: Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..
Boat Airdopes 411: బోట్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. తక్కువ ధరల్లోనే లభ్యం