IPL 2022: కొత్త కెప్టెన్‌తోనైనా కప్పు కొట్టేనా?.. బెంగళూరు మ్యాచ్‌ల పూర్తి వరాలివే..
Royal Challengers Bangalore: క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న IPL 2022 సీజన్ (IPL 2022) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం( మార్చి 26 ) నుంచి మొదలయ్యే ఈ మెగా క్రికెట్ లీగ్ సుమారు 65 రోజుల పాటు జరగనుంది.
Royal Challengers Bangalore: క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తోన్న IPL 2022 సీజన్ (IPL 2022) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శనివారం( మార్చి 26 ) నుంచి మొదలయ్యే ఈ మెగా క్రికెట్ లీగ్ సుమారు 65 రోజుల పాటు జరగనుంది. ఈక్రమంలో తమ అభిమాన జట్లు గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. అలా ఐపీఎల్‌లో చాలామంది అభిమానించే జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). బాగా పేరున్న ఆటగాళ్లు, అభిమాన గణం ఉన్నా ఈ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. దీంతో ఈసారి కొత్త కెప్టెన్ డుప్లెసిస్ సారథ్యంలో మొదటి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ లతో పాటు గ్రూప్ 2లో చోటు దక్కించుకుంది ఆర్సీబీ. కొత్త ఫార్మాట్ ప్రకారం.. RCB తన గ్రూప్‌లోని మిగిలిన జట్లతో ఒక్కొక్కటి రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈక్రమంలో డుప్లెసిస్ సేన ఆదివారం (మార్చి27) తన మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మరి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతోన్న ఆర్సీబీ ఎప్పుడు, ఎక్కడ, ఏయే జట్లతో తలపడబోతుందో చూద్దాం రండి.
RCB IPL 2022 పూర్తి షెడ్యూల్
మార్చి 27, రాత్రి 7.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుvs పంజాబ్ కింగ్స్, డీ వై పాటిల్ స్టేడియం
మార్చి 30, రాత్రి 7.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్, డీవై పాటిల్ స్టేడియం
ఏప్రిల్ 5, రాత్రి 7.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్, వాంఖడే స్టేడియం
ఏప్రిల్ 9, రాత్రి 7.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్, MCA స్టేడియం పుణే
ఏప్రిల్ 12, రాత్రి 7.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్, డీవై పాటిల్ స్టేడియం
ఏప్రిల్ 16, రాత్రి 7.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, వాంఖడే స్టేడియం
ఏప్రిల్ 19, రాత్రి 7.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్, డీవై పాటిల్ స్టేడియం
ఏప్రిల్ 23, రాత్రి 7.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్, బ్రబౌర్న్ స్టేడియం
ఏప్రిల్ 26, రాత్రి 7.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్, MCA స్టేడియం, పూణే
ఏప్రిల్ 30, మధ్యాహ్నం 3.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్, బ్రబౌర్న్ స్టేడియం
మే 4, రాత్రి 7.30 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్, MCA స్టేడియం, పూణే
మే 8, 3.30 PM – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్, వాంఖడే స్టేడియం
మే 13, 7.30 PM – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్, బ్రబౌర్న్ స్టేడియం, ముంబై
మే 19, 7.30 PM – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్, వాంఖడే స్టేడియం, ముంబై
RCB పూర్తి జట్టు:
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, మహిపాల్ లోమోర్డ్, డేవిడ్ విల్లీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ బెహ్రెండార్ఫ్, సిద్ధార్థ్ షరెండార్ఫ్, కౌల్ , ఫిన్ అలెన్, లవ్‌నీత్ సిసోడియా, అనీశ్వర్ గౌతమ్, సుయాష్ ప్రభుదేశాయ్, ఆకాష్ దీప్, చామ మిలింద్.
Also Read: Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..
Vitamin D: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? విటమిన్ డీ లోపం ఉన్నట్లే.. అవేంటో తెలుసుకోండి