Delhi capitals: ఐపీఎల్ 2022కు సిద్ధమైన ఢిల్లీ క్యాపిటల్స్.. ఏ జట్టుతో ఎప్పుడు, ఎక్కడ తలపడుతుందంటే..

ఐపీఎల్ 2022 (IPL 2022) 15వ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ బలమైన జట్టును సిద్ధం చేసింది. నలుగురు పెద్ద ఆటగాళ్లను అంటిపెట్టుకుని ఉంది...

Delhi capitals: ఐపీఎల్ 2022కు సిద్ధమైన ఢిల్లీ క్యాపిటల్స్.. ఏ జట్టుతో ఎప్పుడు, ఎక్కడ తలపడుతుందంటే..
Ipl 2022 Delhi Capitals
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 25, 2022 | 6:00 AM

ఐపీఎల్ 2022 (IPL 2022) 15వ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ బలమైన జట్టును సిద్ధం చేసింది. నలుగురు పెద్ద ఆటగాళ్లను అంటిపెట్టుకుని ఉంది. కెప్టెన్ రిషబ్ పంత్‌(Rishabh Pant), అక్షర్ పటేల్(axer patel), పృథ్వీ షా, ఎన్రిక్ నోర్కియాలను రిటైన్‌ చేసుకుంది. మెగా వేలంలో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులోకి తీసుకుంది. ఢిల్లీ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, చేతన్ సకారియా, మన్‌దీప్ సింగ్ వంటి దేశవాళీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వీరితో పాటు యష్ ధుల్, రోవ్‌మన్ పావెల్ కూడా జట్టులో ఉన్నారు. మార్చి 27 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఆ జట్టు తొలి మ్యాచ్‌ ఆడనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఎప్పుడు, ఎక్కడ ఆడబోతుందో చూద్దాం…

ఢిల్లీ క్యాపిటల్స్ IPL 2022 పూర్తి షెడ్యూల్

మార్చి 27: ఢిల్లీ Vs ముంబై ఇండియన్స్, మధ్యాహ్నం 3:30, బ్రబౌర్న్ స్టేడియం

ఏప్రిల్ 2: ఢిల్లీ Vs గుజరాత్ టైటాన్స్, రాత్రి 7:30, పూణె, MCA స్టేడియం

ఏప్రిల్ 7: ఢిల్లీ Vs లక్నో సూపర్ జెయింట్స్, రాత్రి 7:30, DY పాటిల్ స్టేడియం

ఏప్రిల్ 10: ఢిల్లీ Vs కోల్‌కతా నైట్ రైడర్స్, మధ్యాహ్నం 3:30, బ్రబౌర్న్ స్టేడియం

ఏప్రిల్ 16: ఢిల్లీ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాత్రి 7:30, వాంఖడే స్టేడియం

ఏప్రిల్ 20: ఢిల్లీ Vs పంజాబ్ కింగ్స్, రాత్రి 7:30, పూణె, MCA స్టేడియం

ఏప్రిల్ 22: ఢిల్లీ Vs రాజస్థాన్ రాయల్స్, రాత్రి 7:30, పూణె, MCA స్టేడియం

ఏప్రిల్ 28: ఢిల్లీ Vs కోల్‌కతా నైట్ రైడర్స్, రాత్రి 7:30, వాంఖడే స్టేడియం

మే 1: ఢిల్లీ Vs లక్నో సూపర్ జెయింట్స్, మధ్యాహ్నం 3:30, వాంఖడే స్టేడియం

మే 5: ఢిల్లీ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్, రాత్రి 7:30, బ్రబౌర్న్ స్టేడియం

మే 8: ఢిల్లీ Vs చెన్నై సూపర్ కింగ్స్, రాత్రి 7:30, DY పాటిల్ స్టేడియం

మే 11: ఢిల్లీ Vs రాజస్థాన్ రాయల్స్, రాత్రి 7:30, డివై పాటిల్ స్టేడియం

మే 16: ఢిల్లీ Vs పంజాబ్ కింగ్స్, రాత్రి 7:30, DY పాటిల్ స్టేడియం

మే 21: ఢిల్లీ Vs ముంబై ఇండియన్స్, రాత్రి 7:30, వాంఖడే స్టేడియం

ఢిల్లీ క్యాపిటల్స్  జట్టు

రిషబ్ పంత్ (కెప్టెన్), అశ్విన్ హెబ్బార్, డేవిడ్ వార్నర్, మన్‌దీప్ సింగ్, పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, అన్రిక్ నోర్కియా, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్‌గిడి, ముస్తిఫిజుర్ రెహమాన్, శార్దూల్ ఠాకూర్, అక్సర్ యా నాగర్‌కోటి, లలిత్ పటేల్, కమ్లేష్ , మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, రిప్పల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, విక్కీ ఓస్త్వాల్, యష్ ధుల్, రిషబ్ పంత్, శ్రీకర్ భరత్, టిమ్ సీఫెర్ట్.

Read Also.. IPL 2022: త్వరలో మరో షాక్ ఇవ్వనున్న ధోనీ? కీలక ప్రకటన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ..