IPL 2022: CSK vs KKR మ్యాచ్ కోసం ‘రెడ్’ పిచ్ సిద్ధం.. వాంఖడే మైదానంలో రికార్డులు ఎలా ఉన్నాయంటే?

IPL 2022లో మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గత సీజన్‌లో ఫైనలిస్ట్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది.

IPL 2022: CSK vs KKR మ్యాచ్ కోసం 'రెడ్' పిచ్ సిద్ధం.. వాంఖడే మైదానంలో రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Csk Vs Kkr Ipl 2022 Match Records
Follow us
Venkata Chari

|

Updated on: Mar 25, 2022 | 2:13 PM

ఐపీఎల్ 2022(IPL 2022) ఉత్కంఠ మొదలుకావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గత సీజన్‌లో ఫైనలిస్ట్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Chennai super Kings vs Kolkata knight Riders)మధ్య జరుగుతుంది. రెండు జట్లూ విజయంతో శుభారంభం చేయాలనుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, పిచ్ పాత్ర ఎంతో కీలకమైంది. వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో IPL 2022 మొదటి మ్యాచ్ కోసం రెడ్ పిచ్ సిద్ధం చేశారు. ఈ పిచ్‌కు ఎరుపు రంగులో ఎందుకు ఉంది అంటే, అందులో ఉపయోగించిన మట్టి కారణంగా అలా మరింది.

ఎర్రమట్టితో చేసిన పిచ్‌ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ పిచ్‌పై మంచు ప్రభావం ఎలా ఉంటుంది? ఈ పిచ్ బౌలర్లు లేదా బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటుందా? అలాంటి పిచ్‌పై టాస్ గెలిచిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు CSK లేదా KKR అభిమాని అయితే, ఇది మీకు మరింత ముఖ్యమైనది. ఈ మేరకు వాంఖడే స్టేడియంకు సంబంధించిన డేటా నుంచి తెలుసుకుందాం.

వాంఖడే పిచ్‌కి సంబంధించిన గణాంకాలు..

వాంఖడే స్టేడియంలో గత 13 రాత్రి జరగిన మ్యాచ్‌ల రికార్డును ఓసారి పరిశీలిద్దాం. లక్ష్యాన్ని ఛేదించిన జట్టు 10 సార్లు గెలిచింది. గత 20 మ్యాచ్‌ల్లో ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 175 పరుగులుగా నిలిచింది. ఎర్రమట్టితో తయారు చేసిన వాంఖడే పిచ్‌పై మణికట్టు స్పిన్నర్ల కంటే ఫింగర్ స్పిన్నర్లు మరింత పొదుపుగా ఉంటారని నిరూపిణ అయింది. మణికట్టు స్పిన్నర్ 9.15 ఎకానమీ వద్ద ప్రతి 34 బంతులకు వికెట్లు తీయగా, ఫింగర్ స్పిన్నర్ 6.92 ఎకానమీ వద్ద 27 బంతులకు వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్ చివరి సీజన్‌లో ఇక్కడ ఆడిన మ్యాచ్‌ల గురించి మాట్లాడుతూ, పవర్‌ప్లేలో పేసర్లు 31 వికెట్లు తీయగా, స్పిన్నర్లు వారిపై ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టారు.

టాస్ గెలిస్తే ఎవరికి లాభం..

వాంఖడేలోని ఎర్రమట్టి పిచ్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కీలకమని గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఆపై లక్ష్యాన్ని ఛేజ్ చేస్తేనే విజయం సొంతమవుతుంది. ఆపై మంచు ప్రయోజనాన్ని బౌలర్లు అనుకూలంగా మార్చుకోవచ్చు. భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ప్రకారం, “ఇటువంటి పిచ్‌లలో మంచి బౌన్స్ ఉంటుంది. ఇది ఫాస్ట్ బౌలర్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. వారు మరింత దూకుడుగా మారతాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి జట్టు వికెట్లను టపటపా కూల్చగలరు.

వాంఖడే పిచ్‌పై కొత్త బంతితో తొలి మూడు ఓవర్లలోనే రెండు లేదా మూడు వికెట్లు పడిపోవడం గమనించవచ్చు. ప్రారంభంలో బాగా బౌలింగ్ చేస్తే సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది చెన్నై, హైదరాబాద్ మైదానాల్లో కనిపించదు. వాంఖడే పిచ్‌పై బిగ్ హిట్టర్లు, పేసర్లు, స్వింగ్ బౌలర్లు కీలక పాత్ర పోషించగలరు.

Also Read: IPL 2022, CSK vs KKR, LIVE Streaming: ఐపీఎల్‌కు వేళాయే.. చెన్నై వర్సెస్ కోల్‌కతా మధ్య తొలిపోరు.. ఎక్కడ, ఎలా చూడాలంటే?

IPL 2022: వామ్మో ఇదేం బౌలింగ్‌.. బౌన్సర్లతో భయపెట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌ స్పీడ్ స్టర్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో