Viral Photo: ఈ ఫోటోలోని బుడ్డోడు ఫ్యాన్స్‌కు ఫేవరెట్ మాస్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా!

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సోషల్ మీడియా వినియోగం అనివార్యం అయిపోయింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ విశేషాలన్నింటిని...

Viral Photo: ఈ ఫోటోలోని బుడ్డోడు ఫ్యాన్స్‌కు ఫేవరెట్ మాస్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా!
Tollywood Hero
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 25, 2022 | 12:08 PM

ఈ మధ్యకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సోషల్ మీడియా వినియోగం అనివార్యం అయిపోయింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ విశేషాలన్నింటిని సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగానే ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. తాజాగా పలువురు హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ఓ స్టార్ హీరో చైల్డ్‌హుడ్ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ షేర్ చేయగా.. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కావడంతో.. ఎన్టీఆర్ ఓల్డ్ రేర్ ఫోటోలు ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలోని బుడ్డోడు.. తెలుగులో స్టార్ హీరో.. మాస్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చి 21 ఏళ్లు అవుతున్న ఈ హీరో తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. వరుసపెట్టి కమర్షియల్ సినిమాలు చేసి.. మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తాజాగా ‘కొమరం భీమ్’ క్యారెక్టర్‌లో మరోసారి తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు. ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్.

‘నిన్ను చూడాలని’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్.. ‘స్టూడెంట్ నెం 1’తో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆది’, ‘సింహాద్రి’, ‘యమ దొంగ’, ‘అదుర్స్’, ‘బృందావనం’, ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత వీర రాఘవ’ లాంటి కమర్షియల్ చిత్రాలతో మాస్ ప్రేక్షకులకు ఎన్టీఆర్ మరింత దగ్గరయ్యారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ తమ పాత్రల్లో జీవించేశారని ఫ్యాన్స్ అంటున్నారు.