Uma Bharati: అందుకే యోగి ప్రమాణ స్వీకారానికి రాలేదు.. కేంద్ర మాజీ మంత్రి ట్వీట్

ట్రాఫిక్ కారణంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయానని కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి (Uma Bharati) ట్వీట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి...

Uma Bharati: అందుకే యోగి ప్రమాణ స్వీకారానికి రాలేదు.. కేంద్ర మాజీ మంత్రి ట్వీట్
Uma Bharati
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 26, 2022 | 10:00 AM

ట్రాఫిక్ కారణంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయానని కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి (Uma Bharati) ట్వీట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ(BJP) సీనియర్ లీడర్ ఉమాభారతి హాజరవ్వాల్సి ఉంది. కానీ ట్రాఫిక్ జామ్, స్థానిక పోలీసులు బందోబస్తు పర్యవేక్షణ లో లోపం వంటి కారణంలతో ఆమె కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. “యోగి (Yogi Adityanath) జీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు నేను లక్నో వచ్చాను. ట్రాఫిక్ జామ్ కారణంగా నేను ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకోలేకపోయాను. యోగి జీ ప్రభుత్వం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని ఆమె హిందీలో ట్వీట్ చేశారు. లక్నోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కేశవ్ మౌర్య, బ్రజేష్ పాఠక్ లు ఉపముఖ్యమంత్రులుగా, మరో 16 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హర్యానా సీఎం ఎంఎల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు.

ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్​లో బీజేపీ భారీ విజయం సాధించింది. మొత్తం 403 స్థానాలకుగానూ ఎన్డీఏ కూటమి 273 చోట్ల జయకేతనం ఎగురేసింది. బీజేపీ 255 చోట్ల గెలుపొందింది. 2017 ఎన్నికలతో పోల్చితే సీట్లు కాస్త తగ్గినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సమాజ్​వాదీ పార్టీ 111 స్థానాలు దక్కించుకుంది. ఎన్డీఏ కూటమిలోని అప్నా దళ్ 12 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్​ 2, బీఎస్​పీ ఒక చోట మాత్రమే గెలిచి దారుణ పరాజయాన్ని చవిచూశాయి.

Also Read

RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం

RRR Ticket Price: ఢిల్లీ, ముంబైల్లో RRRటికెట్ రేట్‌ తెలిస్తే గుండె పగిలిపోవాల్సిందే !!

Summer Food Tips: వేసవిలో చర్మం జిడ్డుగా ఉంటుందా? ఆహారం తినేప్పుడు ఈ డ్రింక్స్ తాగండి..