RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' బ్లాక్​బస్టర్​ టాక్​తో దూసుకుపోతోంది. విడుదలకు ముందే కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రం.. తొలి రోజు వసూళ్లలోనూ ఆల్​టైం​ రికార్డులను సెట్​ చేస్తోంది.

RRR day 1 box office collection: తొక్కుకుంటూ పోతున్నారు.. కలెక్షన్ల ఊచకోత.. ప్రేక్షకుల బ్రహ్మరథం
Rrr
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 26, 2022 | 9:59 AM

RRR News:  దుమ్ములేచిపోయింది.. కుంభస్థలం బద్దలయ్యింది. జక్కన్న చెక్కిన RRR సినిమాకు ప్రేక్షకలోకం బ్రహ్మరథం పట్టింది. దేశవ్యాప్తంగా తారక్(Jr NTR), చరణ్‌(Ram Charan)ల నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. రాజమౌళి(SS Rajamouli) తీసిన ఎమోషన్స్, ఎలివేషన్స్‌కు ఆడియెన్స్ ‘టేక్ ఏ బౌ’ అంటున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమా ధర్మకధీరుడు రాజమౌళి మాత్రమే తీయగలడని విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి.  ప్రీమియర్స్​లో ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్​ చేసిన RRR.. ఫస్ట్ డే కలెక్షన్ విషయంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.  అమెరికాలోనే ప్రీమియర్స్​తో పాటు తొలి రోజు కలెక్షన్లు 5 మిలియన్ల  మార్కును దాటేశాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో కలిపి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది ‘ఆర్​ఆర్ఆర్’​. ఇప్పటివరకు ఇదే టాప్ . నైజాంలోనూ ‘ఆర్​ఆర్​ఆర్’​ జోరు చూపిస్తోంది. తొలిరోజే రూ. 23.35 కోట్లు వసూలు చేసి.. కొత్త చరిత్రకు నాంది పలికింది. నైజాంలో తొలి రోజు కలెక్షన్స్ విషయంలో  ‘భీమ్లానాయక్’​- రూ.11.85 కోట్లతో సెకండ్ ప్లేసులో ఉంది. ట్రేడ్ ఎనలిస్ట్ రమేశ్ బాలా లెక్కల ప్రకారం.. హిందీలో ఈ చిత్రం తొలిరోజు  18 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది.

యూకేలో RRR రూ.2.40 కోట్లు రాబట్టింది.

RRR అనేది తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్  అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా రూపొందించబడిన కల్పిత కథ. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించారు. డీవీవీ దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read: బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే…?

సమ్మర్‌ అంటే ఎలా ఉంటుందో ఇవాళ్టి నుంచి తెలుస్తుంది.. నిప్పులు చిమ్మనున్న భానుడు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?