Heat wave: సమ్మర్ అంటే ఎలా ఉంటుందో ఇవాళ్టి నుంచి తెలుస్తుంది.. నిప్పులు చిమ్మనున్న భానుడు
సమ్మర్ అంటే ఎలా ఉంటుందో ఇవాళ్టి నుంచి తెలవనుంది. మార్చి నెల ముగుస్తున్నా ఇప్పటివరకు ఎండల తీవ్రత అంతంతమాత్రంగానే ఉంది. కానీ...
Telangana Heat Wave: సమ్మర్ అంటే ఎలా ఉంటుందో ఇవాళ్టి నుంచి తెలవనుంది. మార్చి(March) నెల ముగుస్తున్నా ఇప్పటివరకు ఎండల తీవ్రత అంతంతమాత్రంగానే ఉంది. ముఖ్యంగా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లబడుతుండడం ఇన్నాళ్లు ఊరటనిచ్చింది. ఇకమీదట అలాంటి వాతావరణం ఉండదని.. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) పెరుగుతున్న ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ(Imd) హెచ్చరించింది. 42 డిగ్రీలకు టెంపరేచర్స్ చేరవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. కాగా ట్రాఫిక్ పోలీసులు(Traffic Police), ఫుట్‌పాత్ వ్యాపారులు, రిక్షా కార్మికులు, ఫుడ్ డెలివరీ సంస్థల కోసం పనిచేసే వారు, కొరియర్ డెలివరీ సిబ్బంది ఈ మండుటెండల్లో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కాగా ఎండల తీవ్రత నేపథ్యంలో వివిధ పట్టణాల్లో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద, వీధుల్లో కొందరు స్వచ్ఛందంగా మంచి నీళ్లు, మజ్జిగ పంచుతున్నారు. ఎండలు రోజురోజుకీ పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాలలో నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని నాయకులు.. ప్రత్యామ్నాయ మార్గాలపై ముందే దృష్టి పెట్టడం మంచింది. కాగా వేసవి తాపం కారణంగా పక్షలు, మూగ జంతువులు నీటి కోసం అల్లాడే అవకాశం ఉంది. వీలైనంతలో వాటి గొంతు తడిపే ప్రయత్నం చేయండి.
Also Read: బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే…?
గృహిణిలకు బంపర్ ఆఫర్.. ముత్యాలను హారాలుగా మార్చడమే పని.. సర్వం గోవిందా