Electricity Fraud: విద్యుత్ శాఖలో వింత మోసం బట్టబయలు.. మీటరున్నా.. బిల్లు రాకపోవడంతో అనుమానం!
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏసీబీ అధికారులు దాడులతో వణికిస్తున్నా.. కొందరు అధికారులు మాత్రం మారడం లేదు. లంచాలకు మరిగి దొంగదారులు తొక్కుతూనే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా విద్యుత్ శాఖలో మీటర్ల పేరుతో జరిగిన అవినీతి బాగోతం ఆలస్యంగా బయటపడింది.
Electricity Fraud: ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఏసీబీ(ACB) అధికారులు దాడులతో వణికిస్తున్నా.. కొందరు అధికారులు మాత్రం మారడం లేదు. లంచాలకు మరిగి దొంగదారులు తొక్కుతూనే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) విద్యుత్ శాఖలో మీటర్ల పేరుతో జరిగిన అవినీతి బాగోతం ఆలస్యంగా బయటపడింది. వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుని విద్యుత్ మీటర్లు(Electricity Meter) ఇచ్చిన కంప్యూటర్ ఆపరేటర్, ఆర్టిజిన్ గ్రేడ్ వర్కర్ కృష్ణ అనే ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అంతేకాకుండా అతడిపై అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 మీటర్లను బిగించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు.
అయితే ఈ వ్యవహారంలో కృష్ణకు మరికొందరు ఉద్యోగులు సహకరించినట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. మీటర్లు బిగించినా.. బిల్లు రాకపోవడంతో బండారం బయటపడింది. ఇప్పటివరకు గుర్తించిన 40 దొంగ మీటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు సైతం అంతర్గతంగా విచారిస్తున్నారు. కొత్త మీటర్లు కావాల్సినవారు మధ్యవర్తులను నమ్మొద్దంటున్నారు ట్రాన్స్‌కో ఎస్‌ఈ. నేరుగా ఆన్‌లైన్‌లోనే మీటర్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా.. చిరుద్యోగి అవినీతి వెనుక ఉన్న తిమింగళాలు వెలికి వస్తే తప్ప ఏస్థాయిలో అవినీతి జరిగిందో తెలియదంటున్నారు స్థానికులు.
Read Also… Crime news: అడవిలో వేటగాడి శవం మాయం.. ఉత్కంఠ రేపుతున్న ఘటన.. అసలేం జరిగిందంటే