Crime news: అడవిలో వేటగాడి శవం మాయం.. ఉత్కంఠ రేపుతున్న ఘటన.. అసలేం జరిగిందంటే

వన్యప్రాణులను వేటాడేందుకు బృందంగా అడవికి వెళ్లారు. రాత్రి చీకటి సమయం కావడంతో వేరే వేటగాళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలకు తగులుకున్నారు. ఒకరికి స్వల్ప విద్యుదాఘాతమైంది. గమనించిన మరో వ్యక్తి బాధితుడిని కాపాడేందుకు...

Crime news: అడవిలో వేటగాడి శవం మాయం.. ఉత్కంఠ రేపుతున్న ఘటన.. అసలేం జరిగిందంటే
Crime
Follow us

|

Updated on: Mar 26, 2022 | 7:34 AM

వన్యప్రాణులను వేటాడేందుకు బృందంగా అడవికి వెళ్లారు. రాత్రి చీకటి సమయం కావడంతో వేరే వేటగాళ్లు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలకు తగులుకున్నారు. ఒకరికి స్వల్ప విద్యుదాఘాతమైంది. గమనించిన మరో వ్యక్తి బాధితుడిని కాపాడేందుకు ప్రయత్నించి విద్యుదాఘాతంతోనే అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తుండగా మృతదేహం(dead body) లభ్యం కాలేదు. నేరం ఎక్కడ బయటపడుతుందోందనని మిగతా ఇద్దరు పరారవగా తీగల్ని ఏర్పాటు చేసిన వారు ఏకంగా మృతదేహాన్నే మాయం చేసేశారు. చివరకు శవం జాడ కనిపెట్టేందుకు పోలీసు(Police Investigation) ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణ(Telangana) లోని కొత్తగూడెం పట్టణానికి చెందిన సునీల్‌కుమార్‌ తన స్నేహితులు మున్నాలాల్‌, వెంకన్నతో కలిసి చుంచుపల్లి అటవీ ప్రాంతంలోకి అర్థరాత్రి సమయంలో వెళ్లారు. వేట కోసం తుపాకీ, కొన్ని ఈటెలను తీసుకెళ్లారు. రాత్రి సమయం కావడం, చీకటి పడటంతో దారి కనిపించక వెంకన్న విద్యుత్ తీగలకు తగిలాడు. ఈ ఘటనలో వెంకన్నకు స్వల్ప విద్యుదాఘాతామైంది. వెంకన్నను కాపాడే ప్రయత్నంలో సునీల్‌ కుమార్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రభయాందోళనకు గురైన మిగతా ఇద్దరు వ్యక్తులు ఇంటికెళ్లారు.

శుక్రవారం ఉదయం జరిగినదంతా స్థానికులు, పోలీసులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లారు. అక్కడ సునీల్‌కుమార్‌ మృతదేహం కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి అన్వేషించారు. అయినప్పటికీ ఎక్కడా మృతదేహం లభ్యం కాలేదు. తీగలు అమర్చిన ప్రాంతంలో వేటకు వినియోగించే బ్యాటరీలు, ఈటెలు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ తీగలు అమర్చిన వారే శవాన్ని మాయం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

వ్యక్తి మృతితో కొత్తగూడెంతో పాటు సమీప మండలాల్లో వన్యప్రాణులను వేటాడే ముఠాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. వేరొక చోటకు శవాన్ని తరలించి పూడ్చివేయడమో? లేక ఆధారాలు దొరకుండా కాల్చివేయడమో చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అనుమానితుల్లో ఒకరైన చుంచుపల్లి మండలానికే చెందిన యువకుడు పోలీసు విచారణ భయంతో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Also Read

Viral Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. ఎంత పని చేసింది ఈ కుక్క.. డ్యాన్స్ చేస్తున్న వరుడికి..!

China Corona: చైనాలో కరోనా కలవరం.. జీరో వ్యూహం అమలులో ప్రజల్లో వ్యతిరేకత

Athletics: నాడు స్టేట్ లెవల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఛాంపియన్‌.. నేడు జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌! అథ్లెట్‌ కన్నీటి గాథ..

Latest Articles
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పురుషులు-మహిళల రిలే జట్లు
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పురుషులు-మహిళల రిలే జట్లు
ఎందుకు బ్రో అంత కోపం.. ఆవేశం ఆపుకోలేక కారు అద్దం పగలకొట్టిన నటుడు
ఎందుకు బ్రో అంత కోపం.. ఆవేశం ఆపుకోలేక కారు అద్దం పగలకొట్టిన నటుడు
ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. రాత్రి భోజనం తర్వాత చిటికెడు తింటే..
ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. రాత్రి భోజనం తర్వాత చిటికెడు తింటే..
హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు పూజ చేస్తారంటే
హిందూ మతంలో ఈశాన్య దిశ ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు పూజ చేస్తారంటే
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ మూవీ రీరిలీజ్
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా..
లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో
లోకాన ఉన్న అందాన్ని అంత పట్టి త్రాసు వేసిన ఈ వయ్యారికి సరితూగవేమో
'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..
'నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం'.. సీఎం జగన్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
కవిత బెయిల్ పిటిషన్‎పై ఢిల్లీ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
యువతలో క్యాన్సర్ ముప్పు ఎందుకు పెరుగుతోంది..? కారణాలు తెలిస్తే..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..