Viral Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. ఎంత పని చేసింది ఈ కుక్క.. డ్యాన్స్ చేస్తున్న వరుడికి..!
Viral Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లికి సంబంధించి అన్ని రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Viral Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లికి సంబంధించి అన్ని రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగానే పెళ్లి తంతు చాలా పెద్దగా ఉంటుంది పెళ్లి నిశ్చయమైంది మొదలు.. అప్పగింతలు పూర్తయ్యేవరకు మధ్యలో అనేక కార్యక్రమాలు ఉంటాయి. సంగీత్, మంగళస్నానం, వివాహ వేదికపై ఎంట్రీ, రిసెప్షన్ ఇలా మాంజి ఆనందభరిత క్షణాలు ఉంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకుంటారు.
అయితే, ప్రపంచ వ్యాప్తంగా రకరకాల మనుషులు, రకరకాల జాతులు, రకరకాల మతాలు, వారి వారి ఆచార సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని చేసుకుంటారు. తాజాగా ఓ వివాహానికి సంబంధించిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పెళ్లి వేడుకలో కుక్క చేసిన పని నవ్వులు పూయిస్తుంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వీడియోలో వధువరులిద్దరూ వెస్ట్రన్ స్టైల్ డ్యాన్స్ వేస్తున్నారు. ఒకరినొకరు హత్తుకుని సాల్సా డ్యాన్స్ వేస్తున్నారు. అయితే, వీరి మధ్యలో పెంపుడు కుక్క కూడా ఉంది. వధువు ఆ కుక్కను ఎత్తుకోని.. వరుడిని హత్తుకోగా. ఇద్దరూ కలిసి కుక్కతో డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో ఆ కుక్క.. పెళ్లి కొడుకు వైపు తదేకంగా చూసింది. వరుడిని చూడగానే ముద్దొచ్చిందో ఏమో గానీ.. పెళ్లి కొడుక్కి తెగ ముద్దులు పెట్టేసింది. కుక్క తన నాలుకతో వరుడి మూతికి వరుస ముద్దులు పెట్టింది. ఈ ఫన్నీ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.
View this post on Instagram
Also read:
Optical Illusion: మీ కళ్లకు అగ్నిపరీక్ష.. ఈ ఫోటోలో ఎంత మంది ఉన్నారో చెబితే మీరే జీనియస్..!
Viral Video: చేసిందంతా చేసి కుక్కను బలి చేసిన కంత్రీ పిల్లి.. వీడియో చూస్తే అవాక్కవుతారు..!
Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..