Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

Astrology: ఒక వ్యక్తి హావభావాలు, జీవన అలవాట్లు మొదలైనవాటిని చూసి వారు ఎలాంటి వారో అనే దానిపై ఒక అంచనాకు వస్తాం.

Astrology: వ్యక్తి ఎత్తును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..
Height
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 25, 2022 | 7:44 PM

Astrology: ఒక వ్యక్తి హావభావాలు, జీవన అలవాట్లు మొదలైనవాటిని చూసి వారు ఎలాంటి వారో అనే దానిపై ఒక అంచనాకు వస్తాం. ఇక జ్యోతిషశాస్త్రంలో, జాతకం ఆధారంగా, నుదిటిని చూడటం, చేతి రేఖలను చూడటం ద్వారా కూడా తెలుసుకుంటారు. అయితే, ఒక వ్యక్తి వ్యక్తి్త్వాన్ని వారి హైట్‌ను బట్టి అంచనా వేయొచ్చని మీకు తెలుసా?. హస్తసాముద్రిక, సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి ఎత్తును బట్టి వారి వ్యక్తిత్వం, స్వభావం, అలవాట్లను అంచనా వేయవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అంటే దీని ప్రకారం.. ఒక వ్యక్తిని దూరం నుండి చూస్తేనే అతని స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చన్నమాట. ఒక వ్యక్తి హైట్ ను బట్టి వారి స్వభావం ఎలా తెలుసుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం..

పొట్టి వ్యక్తులు.. పొట్టి వ్యక్తులు ఆచరణాత్మకంగా ఉంటారు. తమ మాటలతో ఎవరి మనసునైనా సునాయాసంగా గెలుచుకుంటారు. వారి మాటలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ వ్యక్తులు ఎంతటి వారినైనా సులభంగా మోసం చేయగలరు. అందుకే ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక డబ్బు విషయంలో వీరు చాలా కఠినంగా ఉంటారు.

మధ్య స్థాయి వ్యక్తులు.. మధ్య స్థాయి వ్యక్తుల స్వభావం చాలా స్థిరంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా, ఏం ఆలోచించినా న్యూట్రల్‌గా ప్రవర్తిస్తారు. ఏదైనా పని చేసే ముందు అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరు కష్టపడి పనిచేసే తత్వం గలవారు, ధర్మాత్ములు, తెలివైనవారు. వారు ఏదైనా బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకుంటే చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓపికగా ఉంటారు. అయితే, వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. అలాగే.. ఎవరైనా తప్పు చేసి క్షమాపణలు కోరితే వెంటనే క్షమించే దయాహృదయులు వీరు. వీరి జీవితంలో అనేక కష్టాలు ఉంటాయి.

పొడవైన వ్యక్తులు.. పొడుగ్గా ఉండే వ్యక్తులు జాలీగా ఉంటారు. తమను తాము సంతోషంగా ఉంచుకుంటారు. అదే సమయంలో తమతో నివసించే వారిని కూడా సంతోషంగా ఉంచుతారు. వీరి మంచివారు. ఏ పనిని అయినా సులభంగా పూర్తి చేస్తారు. ఈ వ్యక్తులు మంచి దుస్తులు ధరించడానికి ఇష్టపడుతారు. అయితే, వీరికి ఒక వీక్‌నెస్ ఉంది. వీరు త్వరగా ఒత్తిడికి గురవుతారు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత గ్రంధాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.)

Also read:

RUSSIA TO END WAR: యుద్దాన్ని విరమించనున్న రష్యా.. ముహూర్తం ఖరారు చేసిన పుతిన్.. ఈలోగా టార్గెట్ ఇదే!

Viral: ఇదేంది టీచర్ గారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో.. కట్ చేస్తే

Toll tax: మీరు జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నారా.. అయితే మీ జేబు ఖాళీ అవుతుంది..!