Toll tax: మీరు జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నారా.. అయితే మీ జేబు ఖాళీ అవుతుంది..!
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బుందులు పడుతున్న ప్రజలపై మరో పిడుగు పడే అవకాశం ఉంది. జాతీయ రహదారిపై ప్రయాణించే టోల్ ట్యాక్స్(Toll tax) మరింత ఎక్కువగా చెల్లించాల్సి రావొచ్చు...
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బుందులు పడుతున్న ప్రజలపై మరో పిడుగు పడే అవకాశం ఉంది. జాతీయ రహదారిపై ప్రయాణించే టోల్ ట్యాక్స్(Toll tax) మరింత ఎక్కువగా చెల్లించాల్సి రావొచ్చు. ఎందుకంటే జాతీయ రహదారిపై ప్రతి 60 కిలోమీటర్లకు టోల్ ఉంటుందని రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 60కిలోమీటర్ల ముందు టోల్ బూత్ ఉంటే 3 నెలల్లోగా తొలగించాలని గడ్కరీ(Nitin Gadkari) చెప్పారు. అమెరికా మాదిరిగానే భారత్‌లోనూ గొప్ప రహదారులను నిర్మించాలని ప్రభుత్వం చూస్తోంది. కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. వాటిపై పెద్ద మొత్తంలో డబ్బును వెచ్చిస్తున్నారు. టోల్ ప్లాజా(toll plaza) సంఖ్య పెంచాలనుకుంటున్నారు. వచ్చే ఆదాయంతో అప్పులు చెల్లించాలని భావిస్తున్నారు. NHAI మొత్తం అప్పు 3.17 లక్షల కోట్లు.. ఈ అప్పు చెల్లించాలంటే ప్రతి సంవత్సరం 32,000 కోట్ల రూపాయలు కావాలి. దేశంలో జాతీయ రహదారి మొత్తం పొడవు 1 లక్షా 40 వేల 152 కిలోమీటర్లు. వాటిపై 727 టోల్ ప్లాజాలు ఉన్నాయి. సగటున, ప్రతి 192 కిలోమీటర్లకు ఒక టోల్ ప్లాజా ఉంది.
ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు 212 కి.మీ దూరం ఉంది. ఈ రహదారిలో మీరు టోల్ ట్యాక్స్ రూపంలో దాదాపు 275 రూపాయలు చెల్లించాలి. ఢిల్లీ, లక్నోకు 528 కిలోమీటర్లు దూరం ఉంది. ఈ రహదారిపై మీరు టోల్ ట్యాక్స్ రూపంలో 1050 రూపాయలు చెల్లించాలి. సగటున చూస్తే ప్రతి కి.మీకి 1.5 నుంచి 2 రూపాయల వరకు టోల్ ట్యాక్స్ చెల్లించాలి. డిసెంబర్ 2021లో NHAI 3679 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అంటే సగటున రోజుకు 119 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే ఆదాయంలోని ప్రతి 5 రూపాయల్లో 1 రూపాయి అప్పులు చెల్లించవలసి వస్తుంది.
పెట్రోలియం స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం రుణాన్ని చెల్లించడానికి, NHAIకి 2022-23లో 31,049 కోట్ల రూపాయలు, 2023-24లో 31,735 కోట్ల రూపాయలు అవసరం. టోల్ ట్యాక్స్ అనేది నిర్దిష్ట రహదారి, వంతెన, సొరంగంపై ప్రయాణించేటప్పుడు ప్రజలు చెల్లించాల్సిన పన్ను. అలాంటి రోడ్లను టోల్ రోడ్లు అంటారు. ఇది పరోక్ష పన్ను. రోడ్డు నిర్వహణకు కూడా టోల్ ట్యాక్స్ తీసుకుంటారు.
Read Also.. Stock Market: వారంతంలో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 233, నిఫ్టీ 70 పాయింట్లు డౌన్..