Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm: మళ్లీ తగ్గిన పేటీఎం షేరు ధర.. భవిష్యత్తులో ఇంకా పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..

Paytm మాతృ వన్ 97 కమ్యూనికేషన్ సంస్థ షేర్లు శుక్రవారం నాడు 5 శాతానికి పైగా పడిపోయాయి. ఈ షేరు 5.11 శాతం పడిపోయి రూ. 545 వద్ద స్థిరపడింది...

Paytm: మళ్లీ తగ్గిన పేటీఎం షేరు ధర.. భవిష్యత్తులో ఇంకా పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
Paytm
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Mar 25, 2022 | 8:02 PM

Paytm మాతృ వన్ 97 కమ్యూనికేషన్ సంస్థ షేర్లు శుక్రవారం నాడు 5 శాతానికి పైగా పడిపోయాయి. ఈ షేరు 5.11 శాతం పడిపోయి రూ. 545 వద్ద స్థిరపడింది. గురువారం నాడు 9.52 శాతం పెరిగి రూ. 574.35 వద్ద ముగిసింది. డిజిటల్ చెల్లింపు సంస్థ భారతదేశంలో అతిపెద్ద ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)గా వచ్చింది. అయితే అప్పటి నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పేటీఎం IPO ధర రూ. 2,150 కాగా మార్చి 23న షేరు ధర రూ. 520కి చేరుకుంది. అంటే ఇష్యూ ధర కంటే 75.81 శాతం తక్కువ. కంపెనీ వాల్యుయేషన్‌పై విశ్లేషకులు, ట్రేడింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడంతో స్టాక్ విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అదేకాకుండా స్టాక్ ఎక్స్ఛేంజ్ BSE ధరల కదలికపై Paytm నుంచి వివరణ కోరింది.

Paytm షేరు ధర 75 శాతం క్షీణించడంతో కంపెనీ రూ.1.03 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది. దీంతో కస్టమర్‌లు, బ్రోకరేజీలు దీని ధరను డౌన్‌గ్రేడ్ చేస్తున్నాయి. పేటీఎం షేరు ధర 425 స్థాయిలకు పడిపోవచ్చని చెబుతున్నారు. అయితే మంచి త్రైమాసిక ఫలితాలు ధరలను పెంచవచ్చు. ఇది కొనుగోలు చేయడానికి మంచి సమయం కావచ్చని ప్రొఫిషియెంట్ ఈక్విటీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మనోజ్ దాల్మియా అన్నారు. “Paytm స్టాక్ నిరంతరం డౌన్‌ట్రెండ్‌లో ఉంది. ప్రతికూలతలతో రూ.500-450 స్థాయిలను తాకవచ్చని చెబుతున్నారు. పెట్టుబడిదారులు ఈ స్టాక్‌కు ప్రస్తుతానికి దూరంగా ఉండాలని షేర్‌ఇండియా వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ హెడ్ రవి సింగ్ అన్నారు.

Read Also.. Toll tax: మీరు జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నారా.. అయితే మీ జేబు ఖాళీ అవుతుంది..!