AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో తెలుసా..?

బంగారం ధరలు ఇటీవలి కాలంలో పైకి, కిందకు కదులుతున్నాయి. కరోనా కారణంగా ఆగస్ట్ 7, 2020న రూ.56,200 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకిన పసిడి ధరలు..

Gold: బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో తెలుసా..?
Srinivas Chekkilla
|

Updated on: Mar 25, 2022 | 8:25 PM

Share

బంగారం ధరలు ఇటీవలి కాలంలో పైకి, కిందకు కదులుతున్నాయి. కరోనా కారణంగా ఆగస్ట్ 7, 2020న రూ.56,200 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకిన పసిడి ధరలు, ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మళ్లీ రూ.55,000 క్రాస్ చేశాయి. తిరిగి ఇప్పుడు రూ.51,500 దిగువకు వచ్చాయి. గత వారం పసిడి ధరలు రూ.4000 వరకు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోను గోల్డ్ ఫ్యూచర్స్ ఇటీవల ఆల్ టైమ్ గరిష్ఠం 2075 డాలర్ల సమీపానికి చేరుకున్నాయి. ఇప్పుడు తిరిగి 1930 డాలర్ల స్థాయిలో ఉన్నాయి. పసిడి పెరుగుదల, తగ్గుదలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇందులో పసిడిపై ప్రభావం చూపే ప్రధాన అంశాలు ఏమిటో చూద్దాం. పసిడి ధరలు జనవరి 22వ తర్వాత నెల రోజుల్లో 0.028 శాతం క్షీణించగా, ఫిబ్రవరి 22 నుండి 0.127 శాతం పెరిగాయి. మార్చి 22 తర్వాత ఇప్పటి వరకు 0.022 శాతం తగ్గాయి.

మున్ముందు కూడా ఇలాగే, పైకి కిందకు కదలాడే అవకాశాలున్నాయి. బంగారం ధరలపై డిమాండ్ అండ్ సరఫరా, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్భణం, దిగుమతి సుంకాలు, గవర్నమెంట్ రిజర్వ్స్ వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. ఇన్వెస్టర్ కరెన్సీ కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయంలో మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరెన్సీతో పోలిస్తే బంగారం దాదాపు స్థిరంగా ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే బంగారం డిమాండ్ పెరుగుతుంది.

అంతర్జాతీయ కదలికలు బంగారం ధరలో ఏదైనా గ్లోబల్ మూవ్‌మెంట్ భారత్‌లో స్వర్ణం ధరను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఉంది. శాంతియుత వాతావరణంతో పోలిస్తే ఉద్రిక్తతలు చోటు చేసుకున్న పరిస్థితుల్లో పసిడి ధరలు పెరుగుతాయి. అందుకే బంగారాన్ని క్రైసిస్ కమోడిటీ (సంక్షోభ లోహం) పిలుస్తారు. ప్రభుత్వ బంగారం నిల్వలు ప్రధాన దేశాలు అన్ని కరెన్సీతో పాటు బంగారం నిల్వలను కలిగి ఉంటాయి. అమెరికా యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకు రెండు ప్రధాన ఉదాహరణలు. పెద్ద దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను కలిగి ఉండటం, మరింత బంగారాన్ని సేకరిండం ప్రారంభించినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. బంగారం ధరలు తగ్గుతున్న సమయంలోనూ మార్కెట్‌లోకి నగదు ప్రవాహం పెరగడం ఇందుకు కారణం.

Read Also.. Paytm: మళ్లీ తగ్గిన పేటీఎం షేరు ధర.. భవిష్యత్తులో ఇంకా పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..