Airtel Payments: రుణ వాయిదాలు ముందస్తు చెల్లింపులు.. ప్రభుత్వానికి ఎయిర్‌టెల్ రూ.8,815 కోట్లు చెల్లింపు
Airtel Payments: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ 2027, 2028 ఆర్ధిక సంవత్సరాల్లో చెల్లించాల్సిన రుణవాయిదాలకు సంబంధించిన చెల్లింపులను (Payments) ముందస్తుగానే చేసినట్లు..
Updated on: Mar 25, 2022 | 8:37 PM

Airtel Payments: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ 2027, 2028 ఆర్ధిక సంవత్సరాల్లో చెల్లించాల్సిన రుణవాయిదాలకు సంబంధించిన చెల్లింపులను (Payments) ముందస్తుగానే చేసినట్లు సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెల్కో ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఏడేళ్ళక్రితం(2015 లో) వే నాటిలంలో పొందిన స్పెక్ట్రంకు సంబంధించి వాయిదా వేసిన అప్పుల పాక్షిక ముందస్తు చెల్లింపుల కింద.. ప్రభుత్వానికి రూ. 8,815 కోట్లు చెల్లించినట్లు టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ శుక్రవారం వెల్లడించింది.

2015 లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ కోసం వాయిదా వేసిన బాధ్యతలను క్లియర్ చేయడానికి ఎయిర్‌టెల్ రూ. 8,815 కోట్లను ముందస్తుగా చెల్లించింది’ అని కంపెనీ తెలిపింది.

గత నాలుగు నెలల్లో ఎయిర్‌టెల్ వాయిదా వేసిన స్పెక్ట్రమ్ రుణాలకు సంబంధించి.. రూ. 24,334 కోట్లను షెడ్యూల్ కంటే ముందే చెల్లించింది. ఈ రుణాలు పది శాతం వడ్డీ రేటుతో ఉన్నాయి. తన మూలధన నిర్మాణం ద్వారా ఆర్థిక సౌలభ్యంపై దృష్టి సారించడం కొనసాగిస్తున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది.





























