AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇదేంది టీచర్ గారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో.. కట్ చేస్తే

టీనేజర్‌కి పాఠాలు చెప్పాల్సిన టీచర్.. ప్రేమ ఒలకబోసింది. మాయమాటలు చెప్పి ఏకంగా గుడిలో పెళ్లి చేసుకుంది. ఆపై ఎవరికీ కనిపించకుండా వేరే చోటుకు వెళ్లి కొత్త కాపురం పెట్టింది.

Viral: ఇదేంది టీచర్ గారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో.. కట్ చేస్తే
Teacher Love With Student
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2022 | 7:31 PM

Share

టీనేజర్‌కి పాఠాలు చెప్పాల్సిన టీచర్.. ప్రేమ ఒలకబోసింది. మాయమాటలు చెప్పి ఏకంగా గుడిలో పెళ్లి చేసుకుంది. ఆపై ఎవరికీ కనిపించకుండా వేరే చోటుకు వెళ్లి కొత్త కాపురం పెట్టింది. పోలీసులు అతి కష్టం మీద ఈ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు(Tamil Nadu)లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుచిరాపల్లి జిల్లా తురాయూర్(Thuraiyur )​లోని ఓ ప్రైవేటు స్కూల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి(17).. మార్చి 5న ఆడుకోడానికి అని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ అతని పేరెంట్స్.. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్లో ఎంక్వైరీ చేశారు. ఈ క్రమంలో అదే పాఠశాలలో టీచర్‌గా  పనిచేస్తున్న షర్మిల(26) కూడా కనిపించడం లేదని తెలిసింది. వెంటనే పోలీసులకు డౌట్ వచ్చింది. షర్మిల ఇంటికి వెళ్లి వివరాలు వాకబు చేశారు. అయితే తమ కుమార్తె డైలీ ఫోన్‌లో ఓ స్టూడెంట్‌తో మాట్లాడుతుందని వారు చెప్పారు. తప్పని వారించినా పట్టించుకోలేదని వెల్లడించారు. దీంతో షర్మిల ఫోన్ ట్రాక్ చేశారు పోలీసులు. వెళాంకిణి, తిరువారూర్, తంజావూర్, తిరుచిరాపల్లిలో ఆ ఫోన్​ సిగ్నల్స్​ ట్రేస్ అయ్యాయి. తాజా సిగ్నల్ ఆధారంగా చూస్తే షర్మిల ఫోన్ తిరుచిరాపల్లి జిల్లాలోని ఎడమలపట్టి పుత్తూర్​లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మెరుపు వేగంతో అక్కడికి చేరుకన్నారు.

విద్యార్థితో కలిసి తన ఫ్రెండ్​ ఇంట్లో ఆమె ఉన్న విషయం తెలసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. తంజావూరులోని ఓ గుడిలో మైనర్​ను పెళ్లాడినట్లు షర్మిల విచారణలో వెల్లడించింది. బాలుడిని అపహరించి, పెళ్లి చేసుకున్నందుకు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి, పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని పేరెంట్స్‌కు అప్పగించారు. నిందితురాలిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండ్​కు తరలించారు.

Also Read: RRR: బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే…?