Kishan Reddy: ఈశాన్య రాష్ట్రాల సంస్కృత వారధి.. ‘ఇషాన్ మంథన్’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Ishan Manthan: ఢిల్లీలో జరుగుతున్న 'ఇషాన్ మంథన్' కార్యక్రమాన్ని పర్యాటక, అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి.
ఢిల్లీలో జరుగుతున్న ‘ఇషాన్ మంథన్’ (Ishan Manthan)కార్యక్రమాన్ని పర్యాటక, అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) శుక్రవారం ప్రారంభించారు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ వేడుకలో ఈశాన్య రాష్రాల సంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాయి. ఇషాన్ మంథన్ పేరుతో ఈ కార్యక్రమాలను మార్చి 25 నుండి 27 వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (IGNCA)లో నిర్వహిస్తున్నారు. ఇందులో ఈశాన్య భారతదేశంలోని సంస్కృతి, కళ, సంగీతం, జానపద నృత్యం, హస్తకళలు, సాంప్రదాయ ఆహారాలతో పరిచయం చేస్తున్నారు. ఇషాన్ మంథన్ వేడుకలు మూడు రోజులపాటు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహించబడుతుంది.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ వేడుకల ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. ఈశాన్య భారతదేశంలోని దుస్తులు నుంచి పనికి సంబంధించిన వస్తువుల వరకు ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఈ కార్యక్రమం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లోని విభాగం “ప్రజా ప్రవాహ”, సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో కలిసి ఈ వేడుకలను నిర్వహించబడింది. ఇషాన్ మంథన్‌లో ఈశాన్య భారత్‌లోని రాష్ట్రాలైన “అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలను అర్థం చేసుకోవడానికి ఇది మంచి వేదిక అని చెప్పవచ్చు. ఈశాన్య భారత రాష్ట్రాల అభివృద్ధి గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు
Inaugurated “Ishan Manthan”, a 3 day festival to celebrate the rich ethnicity & colours of North Eastern India today at @ignca_delhi. pic.twitter.com/0IGspcbdVK
— G Kishan Reddy (@kishanreddybjp) March 25, 2022
అభివృద్ధి కోసం “రాజకీయ నెట్‌వర్క్” సృష్టించబడింది
ఈశాన్య భారతంలో రైలు నెట్‌వర్క్ కోసం లక్ష కోట్లు, రోడ్ నెట్‌వర్క్ కోసం 55 లక్షల కోట్లు ఖర్చు చేయడమే కాకుండా.. ప్రాంతీయ పార్టీలతో ‘రాజకీయ, సంస్కృతిక నెట్‌వర్క్’ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఇది రాష్ట్రాల సజావుగా సాగేందుకు దోహదపడుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. పాలన, అభివృద్ధి పనిని నిర్ధారిస్తుందన్నారు. ‘ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి. అడవుల పరిరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు ఈశాన్య రాష్ట్ర ప్రజలు తమవంతు సహకారం అందిస్తున్నారు.
సాంస్కృతిక ఐక్యత వ్యక్తీకరణ..
ప్రజా ప్రవాహ జాతీయ కన్వీనర్ జె.నందకుమార్ ప్రసంగిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యం తప్పనిసరిగా భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు నిదర్శనమని అన్నారు. ‘అంతర్లీనమైన ఏకత్వంలో భిన్నత్వం’ చూడటం తాము నేర్చుకున్నామన్నారు. దేశ ఐక్యతకు ముప్పు కలిగించే వాటిని విస్మరించడం అలవాటు చేసుకున్నామన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాల తర్వాత కూడా వలసవాద విద్య కొనసాగడం బ్రిటీష్ వారు సృష్టించిన అపోహలను శాశ్వతం చేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..