AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: పుత్రవాత్సల్యంతోనే రైతుల్ని బలిచేస్తున్నారు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..

Union Minister Kishan Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తే జాలి వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవ చేశారు. రాజకీయ చదరంగంలో రైతుల్ని బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అధికారం నిలబెట్టుకోవడానికి రైతులను కేసీఆర్..

Kishan Reddy: పుత్రవాత్సల్యంతోనే రైతుల్ని బలిచేస్తున్నారు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..
Kishan Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 25, 2022 | 2:27 PM

టీఆర్ఎస్(TRS) ప్రభుత్వాన్ని చూస్తే జాలి వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఎద్దేవ చేశారు. రాజకీయ చదరంగంలో రైతుల్ని బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి అధికారం నిలబెట్టుకోవడానికి రైతులను కేసీఆర్ బలి చేస్తున్నారని విమర్శించారు. కొడుకుకు అధికారం ఇచ్చేందుకు జరిగే ప్రయత్నాల్లో బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి మారలేదన్నారు. రాష్ట్రంతో చేసుకున్న అగ్రిమెంట్ ను ఎక్కడా దాటడం లేదు.. గత నెలలలో కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తే తెలంగాణ హాజరుకాలేదన్నారు. అంతే కాకుండా గతంలో ఇచ్చిన టార్గెట్‌ ఇంత వరకు కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేయలేదని.. ఇంత వరకు FCI ఆ బియ్యం పంపలేదన్నారు. పంజాబ్‌లో కొంటున్నారు అంటూ తెలియకుండా మాట్లాడుతున్నారు. పంజాబ్‌లో ఏటా ఒక్కసారి మాత్రమే ధాన్యం వస్తుందన్నారు.. అయితే ఏపీకి లేని సమస్య తెలంగాణకు మాత్రమే ఎందుకొస్తుందంటూ ప్రశ్నించారు. ఏ రైతు కూడా బాయిల్డ్ రైస్ పండించడు.. మిల్లింగ్‌లోనే అది బాయిల్డ్‌ రైస్‌గా మారుతుంది.. మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో లేని సమస్య తెలంగాణకు ఎందుకు వస్తుందన్నారు.

BJPకి వ్యతిరేకంగా కేసీఆర్ హెలికాఫ్టర్లు వేసుకొని దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు కిషన్‌రెడ్డి. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా 4 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచామని రేపు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో పెట్రోల్ రెట్లు పెరిగితే చాలా రాష్ట్రాలు పన్నులు తగ్గించుకున్న.. తెలంగాణ ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెట్రోల్ పై 20 వేల కోట్లు అదనపు భారం పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: Yogi Adithyanath: యూపీలో బుల్డోజర్ బాబా హవా.. విజయంతో ముస్లిం యువతలో క్రేజ్.. పూర్తి వివరాలివే

Birbhum Incident: రాజకీయ హింసలో అమాయకులు బలవుతున్నారు.. రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న ఎంపీ రూపా గంగూలీ