Birbhum Incident: రాజకీయ హింసలో అమాయకులు బలవుతున్నారు.. రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న ఎంపీ రూపా గంగూలీ

Roopa Ganguly: భీర్‌భూమ్‌ హింసాకాండను తలచుకుని రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ హింసలో అమాయకులు బలవుతున్నారని , బెంగాల్‌ను కాపాడాలని ఆమె సభలో కన్నీరుపెట్టుకున్నారు.

Birbhum Incident: రాజకీయ హింసలో అమాయకులు బలవుతున్నారు.. రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న ఎంపీ రూపా గంగూలీ
Bjp Mp Roopa Ganguly
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 25, 2022 | 1:50 PM

Roopa Ganguly on Birbhum Incident: పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని భీర్‌భూమ్‌(Birbhum) హింసాత్మక ఘటనపై కలకత్తా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను ఏప్రిల్ 7లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. రాజ్యసభ(Rajya Sabha)లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ(BJP) ఎంపీ రూపా గంగూలీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా భీర్‌భూమ్‌ హింసాకాండను తలచుకుని రూపా గంగూలీ భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ హింసలో అమాయకులు బలవుతున్నారని , బెంగాల్‌ను కాపాడాలని ఆమె సభలో కన్నీరుపెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని రూపా గంగూలీ సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది సాధారణ జనం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీర్‌భూమ్‌లో న హింస గురించి ఆమె జీరో అవ‌ర్‌లో ప్రస్తావించారు. కేవ‌లం 8 మంది మాత్రమే మ‌ర‌ణించార‌ని, అంత క‌న్నా ఎక్కువ లేద‌ని ఆమె బెంగాల్ ప్రభుత్వాన్ని ప‌రోక్షంగా విమ‌ర్శించారు. రూపా మాట్లాడుతున్న స‌మ‌యంలో తృణ‌మూల్ ఎంపీలు స‌భ‌లో ఆందోళ‌నకు దిగారు. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం.. రెండు రోజుల క్రితం, శవపరీక్ష నివేదిక వచ్చింది. అందులో ఈ వ్యక్తుల చేతులు మొదట విరిగి, తరువాత గదిలో బంధించి కాల్చివేశారు. ఇక్కడ జనం ఒక్కొక్కరుగా భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. పిల్లలు, వృద్ధులు పారిపోతున్నారు. ప్రజలు ఇక ఇక్కడ నివసించడానికి సరిపోరు. పశ్చిమ బెంగాల్ భారతదేశంలో ఒక భాగం, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన కావాలి, మేము పశ్చిమ బెంగాల్‌లో పుట్టడం నేరం కాదు, ఇది కాళీ మాత నేల అంటూ తీవ్రస్థాయిలో ఆమె ఆవేశంగా మాట్లాడారు. భావోద్వేగంతో ఏడ్చేశారు. ఆ స‌మ‌యంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది .

పశ్చిమ బెంగాల్‌లోని భీర్‌భూమ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత మమత ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ని ఏర్పాటు చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ఈ సంఘటన తర్వాత, TMC ఎంపీ బిశ్వజిత్ దేబ్, పశ్చిమ బెంగాల్ జనాభా 11 కోట్లు అని, అర్ధరాత్రి అలాంటి సంఘటన జరిగితే పోలీసులు ఏమి చేయగలరని అన్నారు. తన ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. తమ పోలీసులు రాత్రిపూట నిద్రపోతున్నారని, తమ ప్రభుత్వం, పోలీసులు 11 కోట్ల మంది ప్రజలను రక్షించలేరని చెప్పాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Read Also….  TRS vs BJP: రైతాంగానికి ఎవరేం చేశారో చర్చకు సిద్దమా.. బీజేపీ నేతలకు ఎర్రబెల్లి సవాల్!