AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..

Yogi Adityanath Oath Ceremony: వరుసగా రెండోసారి ఉత‌్తరప్రదేశ్‌ సీఎంగా ప్రమాణం చేశారు యోగి ఆదిత్యానాథ్‌. లక్నో లోని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ స్టేడియంలో యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 52 మంది మంత్రులతో..

Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..
Yogi Adityanath Oath Cerem
Sanjay Kasula
|

Updated on: Mar 25, 2022 | 5:09 PM

Share

వరుసగా రెండోసారి ఉత‌్తరప్రదేశ్‌ సీఎంగా(Uttar Pradesh Chief Minister) ప్రమాణం చేశారు యోగి ఆదిత్యానాథ్‌. లక్నో లోని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ స్టేడియంలో యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని మోదీతో సహా అతిరథమహారథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 52 మంది మంత్రులతో కొత్త కేబినెట్‌ కొలువు దీరింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేష్‌ పాఠక్‌ ప్రమాణం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. గత కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్న దినేశ్‌ శర్మకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గత కేబినెట్‌లో ఉన్న 20 మంది మంత్రులకు ఈసారి యోగి మంత్రివర్గంలో చోటు లభించలేదు.

ఇద్దరు డిప్యూటీ సీఎంలు..

వాజ్‌పేయి స్టేడియం జనసంద్రంగా మారింది. వేలాదిమంది బీజేపీ కార్యకర్తలు యోగి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. బ్రజేష్‌ పాఠక్‌కు కొత్తగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసి నుంచి ముగ్గురు మంత్రులకు ప్రాతినిధ్యం లభించింది.

యోగి క్యాబినెట్‌..

యోగి ప్రభుత్వ కొత్త మంత్రివర్గంలో సూర్య ప్రతాప్ షాహి, సురేష్ కుమార్ ఖన్నా, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, లక్ష్మీ నారాయణ్ చౌదరి, జైవీర్ సింగ్, ధరంపాల్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా ‘నంది’, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్‌భర్, జితిన్ ప్రసాద్ , రాకేష్ సచన్, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర ఉపాధ్యాయ్, ఆశిష్ పటేల్, సంజయ్ నిషాద్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

Cm Yogi Minister Names List

Cm Yogi Minister Names List

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి యోగి ఆదిత్యనాథ్ ను ఆయన అభినందించారు. యోగి సర్కార్ 2.0 ప్రమాణ స్వీకారోత్సవం కోసం ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రముఖులందరూ రావడం విశేషం. లక్నో చేరుకున్న నితీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ విధానాలను పునరుద్ఘాటించారని అన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ విజయంపై ఇప్పటికే ఫోన్‌లో అభినందనలు తెలిపినట్లుగా సీఎం నితీశ్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రభుత్వానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి: Pegasus Spyware: టీడీపీ పెగాసెస్‌ వ్యవహారంపై హౌస్‌ కమిటీ.. చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి..