RRR: బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే…?

కొన్నాళ్లుగా బోసిపోయిన థియేటర్లు, టాప్‌ హీరోల ఫ్యాన్స్‌తో సందడిగా మారాయి. చాలా రోజుల తర్వాత సినిమా టాకీసుల్లో పాలాభిషేకాలు, పూలదండలు కనిపించాయి. దానికి కారణమైంది జక్కన్న చెక్కిన అపురూప శిల్పం RRR.

RRR: బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఇది పరిస్థితి.. ఎక్కడ తేడా కొట్టిందంటే...?
Annapurna Theatre
Follow us

|

Updated on: Mar 25, 2022 | 3:04 PM

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద RRR సందడి మామూలుగా లేదు. భారీ కటౌట్లు, వందల అడుగుల ఫ్లెక్సీలు, పాలాభిషేకాలతో సినిమాహాళ్లు కళకలలాడుతున్నాయి. ఇలాంటి రోజు కోసం ఎన్నాళ్లో ఎదురుచూశామని చెబుతున్నారు థియేటర్ల ఓనర్లు, సిబ్బంది. విజయనగరం జిల్లా(vizianagaram district )వ్యాప్తంగా థియేటర్స్ వద్ద మెగా(Mega Fans), నందమూరి(Nandamuri Fans) అభిమానుల హంగామా కనిపించింది. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి, వాటివద్ద పూజలు చేస్తూ కనిపించారు అభిమానులు. పలుచోట్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో, బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు కూడా అవస్థలుపడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ(Nandigama)లో ట్రిపులార్ జోష్‌ కనిపించింది. చరణ్, తారక్ అభిమానులు ఉత్సాహంతో బాణాసంచా కాలుస్తూ, కేరింతలు కొట్టారు. కటౌట్‌కి పూలదండలు వేసి, కోబ్బరికాయలు కొట్టారు. డప్పు చప్పుళ్లతో సందడి చేస్తూ, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మెగా, నందమూరి అభిమానులు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కేక్ కట్ చేసి అభిమానులను ఉత్సాహపరిచారు.

ఎన్టీఆర్‌ యునసేన ఆధ్వర్యంలో యూకేలో హంగామా చేశారు తారక్‌ ఫ్యాన్స్‌. యూకేలో RRR రిలీజ్‌ అయిన థియేటర్లు జై ఎన్టీఆర్‌ నినాదాలతో దద్దరిల్లాయి. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, టీడీపీ జెండాలతో థియేటర్‌కు వచ్చి సందడి చేశారు నందమూరి అభిమానులు. అటు అమెరికాలో థియేటర్లో కేక్‌లు కట్‌చేసి సందడి చేశారు తారక్‌ ఫ్యాన్స్‌. భారీ కార్ల ర్యాలీ నిర్వహించి, తారక్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. తూర్పు గోదావరి జిల్లాలో నయా కల్చర్‌ స్క్రీన్‌ మీదికి వచ్చింది. పిఠాపురంలో శ్రీఅన్నపూర్ణా థియేటర్ వద్ద ఎయిర్‌ గన్‌తో హల్‌చల్‌ చేశాడు ఓ అభిమాని. థియేటర్ బయట గన్‌తో ఫోజులిచ్చాడు. అక్కడితో ఆగకుండా, థియేటర్‌లో తెరముందు గన్‌తో తిరుగుతూ కెరింతలు కొట్టాడు. RRR మూవీ సూపర్ హిట్ టాక్‌తో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంభంపాడు అభిమానుల ఆధ్వర్యంలో ప్రేక్షకులకు భోజన ఏర్పాట్లు చేశారు. పెదకూరపాడు హుస్సేన్ బాబా థియేటర్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మెగా, నందమూరి ఫ్యాన్స్‌.

ట్రిపులార్ సినిమాలో ఇద్దరు కాదు ముగ్గురు హీరోలు అన్నట్లుగా ఉంది హైదరాబాద్‌లో జోష్. డైరెక్టర్ రాజమౌళికి హీరో రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తారక్‌, చరణ్‌తోపాటు జక్కన్నకు, హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌ దగ్గర భారీ కటౌట్‌ ఏర్పాటు చేయడం స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా కనిపించింది. ఈ భారీ కటౌట్‌కు పాలాభిశేకాలు, పూల దండలు వేసి కొబ్బరికాయలు కొట్టారు అభిమానులు. అంతా ఓకే కానీ..  బెజవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఉదయం స్పెషల్ షో సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సినిమా మొదలైన గంటకే సాంకేతిక కారణాలతో షో ఆగిపోయింది. దీంతో కోపంతో ఊగిపోయిన తారక్, చరణ్ ఫ్యాన్స్.. థియేటర్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అభిమానుల దాడిలో థియేటర్ అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఇదే థియేటర్‌‌లో ఫ్యాన్స్ వల్ల  స్క్రీన్ దెబ్బతినకండా.. తెర ముందు పత్యేక ఇనుప ముళ్ల కంచెను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Also Read: ఈ ఫోటోలో ఉన్న పర్సన్.. మీ, మా, మనందరి ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా..?