AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న పర్సన్.. మీ, మా, మనందరి ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా..?

స్మాల్ స్క్రీన్ క్వీన్. ఇనిస్టెంట్ పంచ్‌లకు పెట్టింది పేరు. సినిమా వేడుక ఏదైనా ఆమె వాయిస్ వినిపించాల్సిందే. ఏ ఛానల్ మార్చినా ఆమె బొమ్మ కనిపించాల్సిందే. ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థమై ఉంటుంది.

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న పర్సన్.. మీ, మా, మనందరి ఫేవరెట్.. ఎవరో గుర్తుపట్టారా..?
Telugu Actress
Ram Naramaneni
|

Updated on: Mar 24, 2022 | 1:56 PM

Share

Tollywood: స్మాల్ స్క్రీన్ క్వీన్. ఇనిస్టెంట్ పంచ్‌లకు పెట్టింది పేరు. సినిమా వేడుక ఏదైనా ఆమె వాయిస్ వినిపించాల్సిందే. ఏ ఛానల్ మార్చినా ఆమె బొమ్మ కనిపించాల్సిందే. ఇంత చెప్పాక.. తెలుగు జనాలకు మేము చెప్తున్నది ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును పైన ఫోటోలో ఉన్న చిన్నది.. సుమ కనకాల.  సుమ.. ఈ పేరును, ఈ మనిషిని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు బుల్లితెరపై షోల ద్వారా.. సినిమా ఈవెంట్లకు వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు సుపరిచితురాలు సుమ. చలాకీతనం.. వాక్చాతుర్యంతో తెలుగునాట టాప్ యాంకర్‏గా దూసుకుపోతుంది. అంతేకాకుండా.. తాను హోస్ట్‏గా చేస్తోన్న షోలలో తనదైన పంచులతో కామెడీని పండిస్తూ అందర్నీ అలరిస్తుంది. అటు టీవీ షోస్.. ఇటు ప్రీరిలీజ్ ఈవెంట్స్.. సక్సెస్ మీట్స్ అంటూ తెగ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇటీవల సోషల్ మీడియా(Social Media)లో సుమ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన మాటల గారడితో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మలయాళి అమ్మాయి అయినా.. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ… ప్రేక్షకులకు చేరువయ్యింది. నటుడు రాజీవ్ కనకాల(Rajeev Kanakala)ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా బుల్లితెరకు అంకితమైంది సుమ.   సినిమా జనాలందరికీ సుమ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆమె యాంకరింగ్‌తో వేడుక కళే మారిపోతోంది. వల్గారిటీ ఉండదు.. అందరితో ఈజీగా కలిసిపోతోంది. ఎదుటివారిని ఇబ్బంది పెట్టదు. బాగా లౌక్యం తెలిసిన మనిషి. కాగా బుల్లితెర లేడీ సూపర్‌స్టార్‌గా తిరుగులేని హవా ప్రదర్శిస్తోన్న సుమ.. త్వరలో ‘జయమ్మ పంచాయతీ’ సినిమాతో వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. కాగా మార్చి 22న ఆమె బర్త్ డే సందర్భంగా సుమ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)

Also Read: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్​లో ‘ఆర్​ఆర్​ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్

ఎండు మిర్చి మాత్రమే కాదు.. పచ్చి మిర్చి కూడా దుమ్ములేపుతుంది.. కేజీ ఎంతో తెలుసా..?