- Telugu News Photo Gallery Cinema photos Big movies which will release soon on OTT and know their Streaming dates here
OTT Platforms: ఓటీటీ వేదికపై సందడి చేయనున్న పెద్ద సినిమాలు ఇవే.. స్ట్రీమింగ్ డేట్స్ ఏంటంటే..
ఓటీటీ సినిమాలకు అంతకంతకూ ఆదరణ పెరిగిపోతూ వస్తోంది. ఈ వారంలో చాలా సినిమాలు ఆయా ఓటీటీ వేదికలపై హడావిడి చేయనున్నాయి.
Updated on: Mar 24, 2022 | 1:07 PM

పవన్ - రానా నటించిన సినిమా భీమ్లానాయక్ . ఈమూవీ థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నెల 24వ తేదీ నుంచి 'ఆహా'లోనూ .. హాట్ స్టార్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

శర్వానంద్ - రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది

ఇదే రోజున స్టార్ హీరో అజిత్ నటించిన 'వలిమై' జీ 5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సూర్య - ప్రియాంక మోహన్ కాంబినేషన్లో వచ్చిన 'ఈటి' థియేటర్ల ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా రానుంది.

గంగూబాయి' కూడా నెట్ ఫ్లిక్స్ ద్వారానే రానుంది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ స్ట్రీమింగ్ కానుంది.

నెట్ ఫ్లిక్స్ తో పాటు హాట్ స్టార్ లోను '83' రిలీజ్ అయ్యింది. రణ్ వీర్ సింగ్ - దీపిక నటించిన ఈ సినిమా థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది.

ఈ నెల 11న వచ్చిన 'రాధేశ్యామ్' కూడా ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ లో వచ్చే ఛాన్స్ ఉంది.




