RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్
ట్రిపులార్ రిలీజ్‌కి మిగిలింది కొన్ని గంటలే. అయితే ఈలోగా ఏపీలో కొన్ని థియేటర్స్‌కి నోటీసులు జారీ చేశారు అధికారులు. విజయనగరం కొత్తవలసలోని ఓ థియేటర్‌లో టికెట్ రేట్లు ఎక్కువకి విక్రయిస్తున్నారనే సమాచారంతో తహశీల్దార్ నోటీసులిచ్చారు.
RRR Movie News: బాహుబలి( Baahubali ) తర్వాత జక్కన్న క్రియేట్ చేసిన లేటెస్ట్ వండర్ ఇది.. ఇండియన్ మూవీ లవర్స్‌నే కాదు ఇంటర్నేషనల్ ఫిలిం ఆడియన్స్‌ని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా ట్రిపులార్. ఈ పాన్ ఇండియా మూవీ శుక్రవారం సిల్వర్ స్క్రీన్స్‌ని షేక్ చేయబోతుంది. సినీ ప్రపంచంలో ఇప్పుడెక్కడా చూసినా.. ట్రిపులార్ మానియానే. మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది సినీజనం. రిలీజ్‌కు ముందే ఇండియన్ మూవీస్ రికార్డ్లను తిరగరాస్తోంది RRR. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో ఈ మూవీ ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. దీంతో ‘బాహుబలి-2’ రికార్డ్ బ్రేక్ అయ్యింది. ప్రీమియర్స్‌లో 2.4 మిలియన్ డాలర్లను వసూలు చేసింది ‘బాహుబలి-2’. ప్రజంట్ ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో క్రమంగా 3మిలియన్ డాలర్ల వైపు పయనిస్తోంది RRR. దీంతో మునుపెన్నడూ చూడని బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతోంది. అమెరికా(America)లో నేడే (మార్చి 24) ‘ఆర్ఆర్ఆర్’ ప్రీమియర్ షోలు వేయనున్నారు.
కాగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ ఓనర్లను మాత్రం సినిమా రిలీజ్ కంగారెత్తిస్తోంది. అఖండ, భీమ్లా నాయక్, రాధేశ్యాం చిత్రాల రిలీజ్ టైమ్‌లో అభిమానులు అత్యుత్సాహంతో తెరపై పాలు పోశారు. పూలు విసిరారు. హారతులు పట్టారు. కొన్ని చోట్ల స్క్రీన్లను చించేశారు. ట్రిపులార్ సినిమా రిలీజ్‌తో అలాంటి సీన్లు రిపీట్ కాకుండా ఏపీలో థియేటర్ యాజమానులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళంజిల్లా కేంద్రంలోని సూర్య మహల్ థియేటర్‌లో ఫ్యాన్స్ స్క్రీన్ దగ్గరకి వెళ్లి డాన్స్‌లు చేయడం, కాగితాలు విసరడం లాంటి చేయకుండా కంచె ఏర్పాటు చేశారు. ఇటు విజయవాడ అన్నపూర్ణ థియేటర్‌లో ఏకంగా మేకులు కొట్టారు. అభిమానులు అత్యుత్సాహంతో ముందుకెళ్లడానికి అవకాశం లేకుండా చేశారు. నంద్యాలలోని మరో థియేటర్‌లో ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. అభిమానుల హంగామా, సందడితో మిగతా ప్రేక్షకులకు అసౌకర్యం కలగకుండా చాలా థియేటర్లలో ఇలాగే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
ట్రిపులార్ రిలీజ్‌కి మిగిలింది కొన్ని గంటలే. అయితే ఈలోగా ఏపీలో కొన్ని థియేటర్స్‌కి నోటీసులు జారీ చేశారు అధికారులు. విజయనగరం కొత్తవలసలోని ఓ థియేటర్‌లో టికెట్ రేట్లు ఎక్కువకి విక్రయిస్తున్నారనే సమాచారంతో తహశీల్దార్ నోటీసులిచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మించి అమ్మితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో సినిమా టికెట్ల వివాదం హైకోర్ట్‌కి చేరింది. ట్రిపులార్ టికెట్లు బ్లాక్ చేస్తున్నారంటూ హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మరికాసేపట్లో విచారించనుంది న్యాయస్థానం.
Also Read: Viral: పిల్లి వల్ల సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా నష్టం.. 60వేల ఇళ్లకు కరెంట్ కట్..
పెన్షన్ పేరులో వృద్ధురాలిని మోసం చేసిన గ్రామ వాలంటీర్.. ఆస్తికే ఎసరు.. సినిమాను మించిన ట్విస్టులు