Chiranejeevi : కుర్ర హీరోతో కలిసి మరో మలయాళ మూవీ రీమేక్ చేయనున్న మెగాస్టార్

నీకు నేను నాకు నువ్వు కాన్సెప్ట్‌ మెగా కాంపౌండ్‌లో బాగా నడుస్తోంది. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు ఒకరికొకరు సపోర్ట్‌గా వుంటూ కెరీర్‌ని డిజైన్ చేసుకుంటున్నారు.

Chiranejeevi : కుర్ర హీరోతో కలిసి మరో మలయాళ మూవీ రీమేక్ చేయనున్న మెగాస్టార్
Megastar
Rajeev Rayala

|

Mar 24, 2022 | 10:01 AM

Chiranejeevi : నీకు నేను నాకు నువ్వు కాన్సెప్ట్‌ మెగా కాంపౌండ్‌లో బాగా నడుస్తోంది. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు ఒకరికొకరు సపోర్ట్‌గా వుంటూ కెరీర్‌ని డిజైన్ చేసుకుంటున్నారు. లేటెస్ట్‌గా చిరూ అండ్ పవన్ ఇదే థాట్‌ ప్రాసెస్‌తో కొత్త సినిమాల్ని ఒప్పుకుంటున్నారట. భల్లాల దేవుడి సపోర్ట్ తీసుకుని, కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌ రిజిస్టర్ చేసుకున్నారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఇలాగే… భీమ్లానాయక్ తరహాలో మరిన్ని మల్టిస్టారర్లు వర్కవుట్ చేస్తోంది పవన్ కాంపౌండ్. సముద్రఖని డైరెక్షన్‌లో త్రివిక్రమ్ పెన్‌పవర్‌తో వినోదయ సితం అనే రీమేక్‌ ఇప్పటికే పీకే టేబుల్ మీద రెడీగా వుంది. ఇందులో మెగామేనల్లుడు సాయిధరమ్‌ తేజ్ సెకండ్ హీరోగా చేస్తారు. పవర్‌స్టార్ దివి నుంచి దిగొచ్చిన దేవుడిగా కనిపిస్తారు ఈ మూవీలో. ఏప్రిల్‌లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ప్రతిరోజూ పండగే తర్వాత పండగ లాంటి సినిమా పడ్డాక ఇబ్బందుల్లో వున్న సాయితేజ్‌కి పవన్ ఈ సినిమాతో ప్రాపింగ్ ఇస్తున్నారన్నమాట.

మెగాస్టార్ చిరూ కూడా దాదాపుగా ఇటువంటి మైండ్‌సెట్‌తోనే మరో స్మాల్‌ అండ్ స్మార్ట్ ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్నారట. రీసెంట్‌గా మలయాళంలో సక్సెస్ అయిన బ్రోడాడీ… మెగా కాంపౌండ్‌ని బాగానే టచ్ చేసింది. తండ్రిగా మోహన్‌లాల్ చేసిన హిలేరియస్ రోల్‌కి మెగాస్టార్‌ ఈజీగానే కనెక్ట్ అయ్యారు. పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన కొడుకు పాత్రను మెగా కాంపౌండ్‌లో మరో హీరోకి అప్పజెప్పాలన్నది ఇనీషియల్ ప్లాన్. ఇప్పటికే ఆచార్యలో చిరూ-చెర్రీ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఇప్పుడు కామెడీ ఫ్లేవర్లున్న బ్రోడాడీ తెలుగు రీమేక్‌లో కనిపించబోయే మరో యంగ్ మెగా హీరో ఎవరన్నది ఇప్పటికైతే సస్పెన్స్‌. ప్రస్తుతానికి బ్రోడాడీ ప్రపోజల్‌ ప్రైమరీ డిస్కషన్స్‌లోనే వుంది. ఏదైతేనేం.. మెగా ఇలాఖాలో రెండు జెనరేషన్లు కలిసి నటించడం అనేది నయా ట్రెండ్‌గా మారబోతోందన్నమాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరింత దూకుడు పెంచిన ఈడీ.. వారిపై కోర్టు ధిక్కరణ ఫిటిషన్‌ దాఖలు..

Viral Photo: కురుల మాటున అందాల మకరందం.. కుర్రాళ్ల గుండెల్లో సునామీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!

RRR Movie: ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ విడుదలపై కన్నడిగుల ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చుకున్న చిత్రయూనిట్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu