RRR Movie: ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ విడుదలపై కన్నడిగుల ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చుకున్న చిత్రయూనిట్..

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR) ఎట్టకేలకు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకధీరుడు రాజమౌళి

RRR Movie: ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ విడుదలపై కన్నడిగుల ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చుకున్న చిత్రయూనిట్..
Rrr Movie
Follow us

|

Updated on: Mar 23, 2022 | 5:46 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR) ఎట్టకేలకు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఇద్దరు స్టార్ హీరోస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆ (NTR Jr.) ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్.. సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు జక్కన్న అండ్ టీం. పంజాబ్.. ఢిల్లీ.. దుబాయ్.. బెంగుళూరు అంటూ వరుస ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తు్న్నారు. అయితే విడుదలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆర్ఆర్ఆర్‏కు షాకిచ్చారు కన్నడిగులు. సోషల్ మీడియాలో ఈ మూవీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైకాట్ ఆర్ఆర్ఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సినిమాను కన్నడ బాషలో పెద్ద ఎత్తున రిలీజ్ కావడం లేదని.. తెలుగుతోపాటు.. తమిళ్, హిందీ భాషలలో భారీగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని కన్నడ వర్షన్ తక్కువగా విడుదల చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమను అవమానించడమే అంటూ BoycottRRRinKarnataka అనే హ్యాష్‏ట్యాగ్‏ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా కన్నడంలో విడుదలపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ మేరకు ప్రత్యేకంగా నోట్‏ను కూడా విడుదల చేసింది. “రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కన్నడ భాషలో డబ్బింగ్ చెప్పేందుకు ఎంతగానో కృషి చేశారు. మీరు కన్నడలో సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారని మేము అర్థం చేసుకోగలము.. ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ ను ప్లే చేయడానికి ఇష్టపడని థియేటర్ యాజమానులను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాం.. కన్నడ వెర్షన్ ను రేపటిలోగా అన్ని స్క్రీన్ లలోకి తీసుకువస్తామని మేము హామీ ఇస్తున్నాము.. ” అంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్ మార్చి 17న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయడానికి తగినన్ని థియేటర్లు అందుబాటులో లేవు. దీంతో కొన్ని స్ర్కీన్లలో మాత్రమే ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయనుంది చిత్రయూనిట్. దీనిపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీలో అజయ్ దేవగణ్, అలియా భట్.. ఒలివియా మోరీస్.. శ్రియా సరన్ కీలకపాత్రలలో నటించారు.

Also Read: Rashi Khanna: బాడీ షేమింగ్ పై రాశీ ఖన్నా ఓపెన్ కామెంట్స్.. శరీరాకృతిపై దారుణంగా కామెంట్స్ చేసేవాళ్లంటూ..

RRR Movie: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో పాల్గొన్న టీమ్ ట్రిపుల్ ఆర్ టీం.. మొక్కలు నాటిన చెర్రీ..తారక్..జక్కన్న..

Nayantharaa Chakravarthy: చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న మరో నయన్.. జెంటిల్‏‏మన్ 2 సినిమాలో నయనతార చక్రవర్తి..

Salman Khan: మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసిన కోర్టు..