AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: బాడీ షేమింగ్ పై రాశీ ఖన్నా ఓపెన్ కామెంట్స్.. శరీరాకృతిపై దారుణంగా కామెంట్స్ చేసేవాళ్లంటూ..

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో రాశీ ఖన్నా (Rashi Khanna) ఒకరు. మద్రాస్ కేఫ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి

Rashi Khanna: బాడీ షేమింగ్ పై రాశీ ఖన్నా ఓపెన్ కామెంట్స్.. శరీరాకృతిపై దారుణంగా కామెంట్స్ చేసేవాళ్లంటూ..
Rajitha Chanti
|

Updated on: Mar 23, 2022 | 2:45 PM

Share

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో రాశీ ఖన్నా (Rashi Khanna) ఒకరు. మద్రాస్ కేఫ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..ఊహలు గుసగుసలాడే సినిమాతో హిట్ అందుకుంది. ఈ మూవీతో రాశీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది. జిల్, జోరు, బెంగాల్ టైగర్, హైపర్.. తొలిప్రేమ.. వరల్డ్ ఫేమస్ లవర్.. ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. మొదటి నుంచి ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించే రాశీ ఖన్నా.. ఇప్పుడు ట్రెండ్ మార్చింది. గ్లామర్ షోలకు మొదట ప్రాధాన్యత ఇస్తూ దూసుకుపోతుంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్ సిరీస్‏తో హిందీ ప్రేక్షకులను పలకరించింది. అయితే కెరీర్ ఆరంభంలో తాను బాడీ షేమింగ్ ఎదుర్కోన్నానని.. బొద్దుగా ఉండడం వలన దక్షిణాది చిత్రపరిశ్రమ వాళ్లు తనపై కామెంట్స్ చేసేవారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పటివరకూ కెరీర్ పరంగా మీరు ఎదుర్కొన్న విమర్శలు ఏమిటీ? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ” దక్షిణాది చిత్రపరిశ్రమలో హీరోయిన్‏గా అడుగులు వేస్తున్న సమయంలో చాలా మంచి అవకాశాలు వచ్చాయి.. అందుకు చాలా సంతోషించాను.. కానీ అదే సమయంలో శరీరాకృతి పరంగా నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. చూడటానికి లావుగా ఉండడంతో దక్షిణాదిలో చాలా మంది నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవాళ్లు. కొంతకాలం గడిచే సరికి సన్నగా మారాలని నిర్ణయించుకున్నాను.. ఫిట్ అయ్యాను. నేను చేస్తున్న వృత్తికి నాజుగ్గా ఉండడం ఎంతో అవసరమని అర్థమైంది. అందుకే సన్న బడ్డాను… అంతేకానీ వాళ్ల నోర్లు మూయించాలని కాదు.. సోషల్ మీడియాలోనూ ఇలాంటి విమర్శలు ఎదురైనప్పటికీ నేను ఏమాత్రం బాదపడలేదు ” అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Ram Gopal Varma : బాలీవుడ్‌ను తన స్టైల్‌లో కడిగిపారేసిన ఆర్జీవీ.. కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్

Avatar 2 : అవతార్ 2 ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. విజువల్ ట్రీట్ ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

Harish Shankar: బంపర్ ఆఫర్ అందుకున్న హరీష్ శంకర్.. మెగాస్టార్‌తో ఆ మూవీ రీమేక్

RRR Movie: రేటు ఎంతయినా తగ్గేదే లే.. ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం పోటీపడుతున్న ఫ్యాన్స్ .