RRR Movie: రేటు ఎంతయినా తగ్గేదే లే.. ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం పోటీపడుతున్న ఫ్యాన్స్ .
ప్రస్తుతం అందరి చూపు ఆర్ఆర్ఆర్ సినిమా పైనే ఉంది. సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ లో మొదలైంది.
RRR Movie: ప్రస్తుతం అందరి చూపు ఆర్ఆర్ఆర్(RRR) సినిమా పైనే ఉంది. సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ లో మొదలైంది. మరో రెండు రోజుల్లో అంటే మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఇప్పటికే అన్ని భాషల్లో క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. ఈ మూవీ పై అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు జక్కన్న అండ్ టీమ్. ఇప్పటికే ముంబై , కర్ణాటక లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అలాగే దుబాయ్‌లో మొదలుపెట్టి.. బరోడా, వారణాసి, ఢిల్లీ, అమృత్‌సర్, జైపూర్… ఇలా రోజుకు రెండు మహానగరాల్ని టచ్ చేస్తూ.. దేశవ్యాప్త ప్రచారానికి రోడ్‌మ్యాప్ డిజైన్ చేసుకున్నారు. ఇద్దరు బడా హీరోలు.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. బడ్జెట్ కు వెనకాడని నిర్మాత అన్ని కలుపుకొని భారీగా రూపొందింది ఈ మూవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) గోండు బెబ్బులి కొమురం భీమ్ గా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం పులి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా సందడి నాలుగు రోజుల ముందే మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కానున్న థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తారక్ , చరణ్ భారీ కటౌట్ లు , ఫ్లక్సీ లు ఏర్పాటు చేస్తున్నారు. థియేటర్ కూడా కనిపించినంతగా ఫ్లక్సీ లతో నింపేస్తున్నారు ఫ్యాన్స్. అంచనాలకు తగ్గట్టే సినిమాలోనూ చాలా ప్రత్యేకతలున్నాయని తెలుస్తోంది. చరణ్ , తారక్ పర్ఫామెన్స్ సినిమాను తారాస్థాయిలో నిలిబెడుతుందని తెలుస్తుంది. ఈ మూవీ 60 దేశాల్లో రికార్డు స్థాయి స్క్రీన్ లలో విడుదలవుతోంది. ఐదు భాషల్లో 2డీ 3డీ ఐమాక్స్ ఫార్మాట్ లలో విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్స్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. మొదటి రోజే సినిమా చూడాలని అభిమానులంతా తాపత్రయపడుతున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ ఫుల్ అయిపోతున్నాయి. ఇక బెనిఫిట్ షో టికెట్స్ కోసం అభిమానులు పోటీపడుతున్నారు. దాంతో సినిమా టికెట్స్ కు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కోటికెట్టు 5000 పలుకుతున్నా అభిమానులు వెనుకాడటం లేదు