Harish Shankar: బంపర్ ఆఫర్ అందుకున్న హరీష్ శంకర్.. మెగాస్టార్‌తో ఆ మూవీ రీమేక్

షాక్ సినిమాతో దర్శకుడి గా పరిచయం అయ్యాడు హరీష్ శంకర్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత వెంటనే రవితేజాతోనే మిరపకాయ్ సినిమా చేసి హిట్ కొట్టాడు హరీష్.

Harish Shankar: బంపర్ ఆఫర్ అందుకున్న హరీష్ శంకర్.. మెగాస్టార్‌తో ఆ మూవీ రీమేక్
Hareesh Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 23, 2022 | 9:48 AM

Harish Shankar: షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హరీష్ శంకర్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత వెంటనే రవితేజ(Ravi Teja)తోనే మిరపకాయ్ సినిమా చేసి హిట్ కొట్టాడు హరీష్. రవి తేజ కెరీర్ లో మిరపకాయ్ సినిమా వన్ ఆఫ్ ది సూపర్ హిట్ గా నిలిచింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కెరీర్ లో ఖుషి తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది గబ్బర్ సింగ్. ఈ మూవీతో హరీష్ శంకర్ టాప్ దర్శకుల లిస్ట్ లోకి చేరిపోయాడు. ఆతర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ సినిమా చేసి డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డీజే సినిమా చేసి మరో హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే గద్దల కొండ గణేష్ అంటూ మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేసి సక్సెస్ అయ్యాడు.

ఇలా వరుసగా మెగా హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్న హరీష్ శంకర్ ఇప్పుడు పవర్ స్టార్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన హరిహర వీర మల్లు సినిమా పూర్తయిన తర్వాత హరీష్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు హరీష్, శంకర్ కు మరో బంపర్ ఆఫర్ వాచినట్టు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హరీష్ పవన్ సినిమా తరువాత చిరంజీవితో ఒక ప్రాజెక్టు చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. మలయాళంలో వచ్చిన ‘బ్రో డాడీ’  భారీ విజయాన్ని సాధించింది. మోహన్ లాల్ .. పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ రీమేక్ చేయాలని మెగాస్టార్ చూస్తున్నారట. ఆ బాధ్యతలను హరీష్ శంకర్ కు అప్పగించారని టాక్. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కి సంబంధించిన మార్పుల గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raashi Khanna: బొద్దుగా ఉన్నందుకు అలా వెటకారంగా పిలిచేవారు.. బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌ను గుర్తు చేసుకున్న రాశి..

Viral Video: ఇదేం ఫాలోయింగ్‌ రా బాబూ!.. గులాబీ పూలతో ఆ హీరో వెంటపడిన అమ్మాయిలు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Chiranjeevi: జాతీయ సాంస్కృతిక మహోత్సవాల సక్సెస్‌కు మెగాస్టార్‌ పిలుపు.. ఉత్సవాలు ఎప్పటినుంచంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే