AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avatar 2 : అవతార్ 2 ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. విజువల్ ట్రీట్ ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

హాలీవుడ్ సినిమాలు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన స్పైడర్ మ్యాన్ సూపర్ హిట్ గా నిలిచింది.

Avatar 2 : అవతార్ 2 ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. విజువల్ ట్రీట్ ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?
Avatar 2
Rajeev Rayala
|

Updated on: Mar 23, 2022 | 10:36 AM

Share

Avatar 2 : హాలీవుడ్ సినిమాలు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన స్పైడర్ మ్యాన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పటివరకు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతులను ఇచ్చిన మూవీస్ లో అవతార్ (Avatar) ఒకటి. వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తన అద్బుతమైన క్రియేటివిటితో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లారు అనడంలో సందేహం లేదు. అవతార్ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవతార్ సినిమా విడుదలైన సమయంలోనే దీనికి సిక్వెల్ ఉంటుందని ప్రకటించారు మేకర్స్. దీంతో అవతార్ సెకండ్ పార్ట్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవలే అవతార్ 2 విడుదల తేదీని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 16న విడుదల చేయబోతున్నారు. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.

తాజాగా ఈ విజువల్ ట్రీట్ ట్రైలర్ తేదీ ఫిక్సైనట్లు తెలుస్తుంది. మే 6వ తేదిన `అవతార్-2` ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉంది. కోవిడ్ కారణంగా అన్ని పనుల్ని వాయిదా వేసారు. కరోనా కారణంగా చాలా వరకు షూటింగ్ ఆగిపోయింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రచారం పనుల్ని ట్రైలర్ ఆవిష్కరణతో మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. అండర్ వాటర్ లో అవతార్ ప్రత్యర్ధులతో చేసే పోరాటాలు హైలైట్ గా ఉంటాయని ఊహించొచ్చు. ఇక ఈ సినిమా సెకండ్ సిక్వెల్ ను 2024లో డిసెంబర్ లో.. మూడవ సీక్వెల్ డిసెంబర్ 2026లో.. నాల్గవ సీక్వెల్ 2028 విడుదల చేయాలని భావిస్తున్నారట. అంతేకాకుండా ఈ సీక్వెల్స్ లలో కొత్త నటీనటులు యాడ్ కాబోతున్నారు. ఒక్కో భాగానికి 1900 కోట్ల బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్నారు. అంటే మొత్తం నాలుగు `అవతార్` ప్రాంచైజీలకు కలిపి11300 కోట్లు ఖర్చు అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raashi Khanna: బొద్దుగా ఉన్నందుకు అలా వెటకారంగా పిలిచేవారు.. బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌ను గుర్తు చేసుకున్న రాశి..

Viral Video: ఇదేం ఫాలోయింగ్‌ రా బాబూ!.. గులాబీ పూలతో ఆ హీరో వెంటపడిన అమ్మాయిలు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Chiranjeevi: జాతీయ సాంస్కృతిక మహోత్సవాల సక్సెస్‌కు మెగాస్టార్‌ పిలుపు.. ఉత్సవాలు ఎప్పటినుంచంటే..

Follow Us