Ram Gopal Varma : బాలీవుడ్‌ను తన స్టైల్‌లో కడిగిపారేసిన ఆర్జీవీ.. కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్

దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన సినిమా కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files). చాలా మంది ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

Ram Gopal Varma : బాలీవుడ్‌ను తన స్టైల్‌లో కడిగిపారేసిన ఆర్జీవీ.. కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్
Rgv
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 23, 2022 | 11:41 AM

The Kashmir Files: దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన సినిమా కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files). చాలా మంది ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పెను సంచలనమే సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలను సినిమాలో కళ్లకు కట్టారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలకపాత్ర పోషించారు. 1990లలో కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దారుణలను ఈ సినిమాలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించారు. బాలీవుడ్ కమ్యూనిటికీ చెందిన పలువురు ఇప్పటికే ఈ సినిమాకు అనుకూలంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా బాలీవుడ్ చరిత్రను మార్చేసిందన్నారు ఆర్జీవీ. బాలీవుడ్ టాప్ 7 ప్రొడక్షన్ హౌస్ లు టాప్ లో ఉండటానికి పోటీపడుతూ ఉంటాయి. కానీ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు ఎప్పుడు ఎలా వచ్చి టాప్ చైర్ లో కూర్చుంటాయో చెప్పలేం అని ఆర్జీవీ అన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్  కిల్లర్ విజయం బాలీవుడ్‌లో ఉన్న అపోహలను చేరిపేసిందని అని వర్మ రాసుకొచ్చారు. ఆ అపోహలు ఏంటంటే..

  • హిట్ సాధించాలంటే పెద్ద స్టార్లు కావాలి (కాశ్మీర్ ఫైల్స్ లో స్టార్లు లేకపోవడమే కాకుండా, సినిమా డిజైన్ స్టార్‌ని కలిగి ఉండకూడదు)
  •  హిట్ సాధించడానికి మీకు మెగా బడ్జెట్‌లు అవసరం ( కాశ్మీర్ ఫైల్స్ చాలా తక్కువ బడ్జెట్)
  • హిట్ కావాలంటే మీకు సూపర్ హిట్ పాటలు కావాలి (కాశ్మీర్ ఫైల్స్ లో ఒక్క థీమ్  తప్ప మరేమీ లేదు)
  • హిట్ చేయడానికి మీకు మసాలా వినోదం అవసరం (కాశ్మీర్ ఫైల్స్ లో మీరు ఒక్కసారి కూడా నవ్వలేరు)
  • హిట్ చేయడానికి మీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావాలి (కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత గురించి ఎవరూ పెద్దగా వినలేదు)
  • మీరు హిట్  చేయడానికి అనేక కోట్ల ప్రమోషన్స్ కావాలి (రాధే శ్యామ్ 25 కోట్లతో పోలిస్తే కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలు కేవలం 2.5 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు చేసారు)
  • ప్రేక్షకులు లాజిక్స్ లేని సినిమాలే చూస్తారని అనుకోవద్దు (ప్రేక్షకులు తీవ్రమైన సమస్యల గురించి తెలుసుకోవాలని  కోరుకుంటున్నారని కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత గ్రాంట్‌గా తీసుకున్నారు)
  • ఛార్ట్ బస్టర్ పాటలను చూపించాల్సి ఉంటుంది  (కాశ్మీర్ ఫైల్స్ లో ఎటువంటి ప్రయత్నం లేదు.  హమ్ దేఖేంగే అనే బ్యాక్ గ్రౌండ్ థీమ్ మాత్రమే ఉంటుంది)  ఇలా చాలా పాయింట్స్ ను ఆర్జీవీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raashi Khanna: బొద్దుగా ఉన్నందుకు అలా వెటకారంగా పిలిచేవారు.. బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌ను గుర్తు చేసుకున్న రాశి..

Viral Video: ఇదేం ఫాలోయింగ్‌ రా బాబూ!.. గులాబీ పూలతో ఆ హీరో వెంటపడిన అమ్మాయిలు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Chiranjeevi: జాతీయ సాంస్కృతిక మహోత్సవాల సక్సెస్‌కు మెగాస్టార్‌ పిలుపు.. ఉత్సవాలు ఎప్పటినుంచంటే..