RRR Movie: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో పాల్గొన్న టీమ్ ట్రిపుల్ ఆర్ టీం.. మొక్కలు నాటిన చెర్రీ..తారక్..జక్కన్న..

పచ్చదనం పెంపు తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అని దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అన్నారు. బుధవారం మెగా

RRR Movie: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో పాల్గొన్న టీమ్ ట్రిపుల్ ఆర్ టీం.. మొక్కలు నాటిన చెర్రీ..తారక్..జక్కన్న..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2022 | 4:48 PM

పచ్చదనం పెంపు తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అని దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అన్నారు. బుధవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. జూనియర్ ఎన్టీఆర్‏తో (NTR Jr.) కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో పాల్గొన్నారు జక్కన్న. ఇంతటి బిజీ షెడ్యూల్‏లోనూ గ్రీన్ ఛాలెంజ్‏లో పాల్గొన్న ట్రిపుల్ ఆర్ టీమ్‏ను తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న చిత్ర బృందం ఇవాళ హైదరాబాద్‏లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో భాగం అయ్యారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‏తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు.

ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని డైరెక్టర్ రాజమౌళి తెలిపారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ సంకల్పం చాలా గొప్పదని, మరింత విజయవంతం కావాలన్నారు. బాహుబలి టీమ్ తో కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు హీరో జూ.ఎన్టీఆర్. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని అన్నారు. ఈ భూమిపై మనం అందరమూ అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలనూ అలాగే నాటి రక్షించాలి కోరారు.

హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తాను గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్ చేశానని, మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందని, ట్రిపుల్ ఆర్ రిలీజ్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్‏ను ట్రిపుల్ ఆర్ టీమ్ అభినందించింది. సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైందని, సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 ఫ్రేమ్స్ కళాకారులకు ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. మూవీ రిలీజ్ షెడ్యూల్‏లో బిజీగా ఉండి కూడా, చొరవ తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ లు కరుణాకర్ రెడ్డి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Ram Gopal Varma : బాలీవుడ్‌ను తన స్టైల్‌లో కడిగిపారేసిన ఆర్జీవీ.. కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్

Avatar 2 : అవతార్ 2 ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. విజువల్ ట్రీట్ ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

Harish Shankar: బంపర్ ఆఫర్ అందుకున్న హరీష్ శంకర్.. మెగాస్టార్‌తో ఆ మూవీ రీమేక్

RRR Movie: రేటు ఎంతయినా తగ్గేదే లే.. ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం పోటీపడుతున్న ఫ్యాన్స్ .