Adhira: హీరోగా బడా నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు.. “అధీరా” ఫస్ట్ గింప్స్ చూస్తే మైండ్ బ్లాంక్..

క్రియేటివ్ జీనియస్ అండ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) సరికొత్త పంథా ఎంచుకుంటున్నారు.

Adhira: హీరోగా బడా నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు.. అధీరా ఫస్ట్ గింప్స్ చూస్తే మైండ్ బ్లాంక్..
Adhira
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2022 | 5:08 PM

క్రియేటివ్ జీనియస్ అండ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) సరికొత్త పంథా ఎంచుకుంటున్నారు. స్టార్ హీరోస్‏తో సినిమాలు తీయకుండా యంగ్ అండ్ క్రేజీ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. టాలీవుడ్‌కి జోంబీ కాన్సెప్ట్‌ని పరిచయం చేసిన తర్వాత ప్రశాంత్ వర్మ మొదటి ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో సినిమా హను-మాన్‌ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నాడు. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ప్రశాంత్ వర్మ మరో సూపర్ హీరో సినిమాతో యంగ్ హీరోని పరిచయం చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తదుపరి చిత్రం అధీరతో (Adhira) ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.

భారతీయ పౌరాణిక పాత్రల నుండి ప్రేరణ పొందిన ప్రశాంత్ వర్మ మార్వెల్ , DC వంటి సూపర్ హీరోల విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఈ చిత్రం స్క్రిప్ట్, కథ-చెప్పడం పరంగా ప్రత్యేకంగా ఉంటుంది. కళ్యాణ్ టైటిల్ రోల్‌లో కనిపించనున్న మరో సూపర్ హీరో చిత్రం అధీర. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా అధీర ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. మన అసలైన సూపర్‌హీరో యొక్క సూపర్ పవర్‌లను ప్రదర్శించడానికి వీడియోలో వరుస సన్నివేశాలు చూపించారు. విజువల్స్ హాలీవుడ్ స్టాండర్డ్‌తో సమానంగా ఉన్నాయి. ‘అధిర ఫస్ట్ స్ట్రైక్’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని యాక్షన్ కోలాహలాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాడు ప్రశాంత్ వర్మ. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దాశరధి శివేంద్ర కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.

Also Read: Ram Gopal Varma : బాలీవుడ్‌ను తన స్టైల్‌లో కడిగిపారేసిన ఆర్జీవీ.. కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్

Avatar 2 : అవతార్ 2 ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. విజువల్ ట్రీట్ ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

Harish Shankar: బంపర్ ఆఫర్ అందుకున్న హరీష్ శంకర్.. మెగాస్టార్‌తో ఆ మూవీ రీమేక్

RRR Movie: రేటు ఎంతయినా తగ్గేదే లే.. ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం పోటీపడుతున్న ఫ్యాన్స్ .