K.G.F: Chapter 2: ఫ్యాన్స్ కు పూనకాలే.. కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో..?

కేజీఎఫ్ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా కేజీఎఫ్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది.

K.G.F: Chapter 2: ఫ్యాన్స్ కు పూనకాలే..  కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్‌కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో..?
Kgf 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 06, 2022 | 3:39 PM

K.G.F: Chapter 2: కేజీఎఫ్ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కన్నడ స్టార్ హీరో యశ్ అన్ని భాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుంది. భారీ క్రేజీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కేజీఎఫ్ ఛాప్టర్1  పాన్ ఇండియా రేంజ్ బాక్సాఫీస్ దగ్గ‌ర క్రియేట్ చేసిన సెన్సేష‌న్‌ను ఇప్పుడే ఎవ‌రూ మ‌ర‌చిపోలేం. ఈ దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అంచ‌నాల‌ను మించేలా భారీ బ‌డ్జెట్‌, స్టార్ క్యాస్టింగ్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాను రూపొందించారు మేక‌ర్స్‌. కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే హోంబ‌లే ఫిలింస్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమానుంచి తుఫాన్ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ తదుపరి సినిమా అయిన ‘సలార్’కి ప్రశాంత్ నీల్ దర్శకుడు. దాంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్ గా రానున్నాడని టాక్ నడుస్తుంది. ఇంతకు ముందు సలార్ మూవీ ఓపెనింగ్ కు యశ్ హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. మరి కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తాడా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరింత దూకుడు పెంచిన ఈడీ.. వారిపై కోర్టు ధిక్కరణ ఫిటిషన్‌ దాఖలు..

Viral Photo: కురుల మాటున అందాల మకరందం.. కుర్రాళ్ల గుండెల్లో సునామీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!

RRR Movie: ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ విడుదలపై కన్నడిగుల ఆగ్రహం.. క్లారిటీ ఇచ్చుకున్న చిత్రయూనిట్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?