Nikhil Siddharth: మాస్ మహారాజాతో పోటీపడుతున్న కుర్ర హీరో.. ఒకే రోజు రెండు సినిమాలు
కుర్ర హీరో నిఖిల్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి క్రియేట్ ఏర్పడుతుంది... ఎందుకంటే ఆయన ఎంచుకుంటున్న కథలు అలాంటివి.
Nikhil Siddharth: కుర్ర హీరో నిఖిల్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి క్రియేట్ ఏర్పడుతుంది… ఎందుకంటే ఆయన ఎంచుకుంటున్న కథలు అలాంటివి. స్వామిరారా(Swamy Ra Ra) సినిమాతో సైలెంట్ హిట్ అందుకున్న నిఖిల్.. ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. స్వామిరారా తర్వాత సూర్య వర్సెస్ సూర్య , కార్తికేయ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. ఆ వెంటనే ఎక్కడికిపోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సుకుమార్రైటింగ్స్ లో నిఖిల్ 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో నిఖిల్ విభిన్న మైన పాత్రలో కనిపించనున్నాడట. అలాగే చెందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 అనే సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో కార్తికేయ సినిమా వచ్చింది.
’18 పేజెస్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రానికి ‘కుమారి 21F’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ ’18 పేజెస్’ చిత్రానికి కథ – స్క్రీన్ ప్లే అందించడంతో పాటుగా సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను జూన్ 17వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ జూన్ 17 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అదే రోజున రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా థియేటర్లకు రానుంది. . శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. దాంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండనుంది. చూడాలి మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :