Aditi Rao Hydari: తన అందానికి కారణమేంటో చెప్పేసిన అందాల తార.. అదితీ బ్యూటీ సీక్రెట్ ఇదేనంటా..
Aditi Rao Hydari: 2006లో మలయాళ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార అదితీరావ్ హైదరీ. పేరుకు హైదరాబాదీ అయిన ఈ చిన్నది టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం చాలా సమయమే పట్టింది. 2018లో వచ్చిన 'సమ్మోహనం' చిత్రంతో..
Aditi Rao Hydari: 2006లో మలయాళ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార అదితీరావ్ హైదరీ. పేరుకు హైదరాబాదీ అయిన ఈ చిన్నది టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం చాలా సమయమే పట్టింది. 2018లో వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే కుర్రకారు మదులను కొల్లగొట్టింది. తనదైన అందం, సహజ నటనతో మెప్పించింది. అంతరిక్షం, వి వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న అదితీ ఇటీవల తన అందానికి గల కారణమేంటో చెప్పేసింది.
చూడగానే ఆకట్టుకునే మేలిమి చాయతో ఉండే అదితీ సౌందర్యానికి గల కారణాన్ని వివరించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటమే నా అందానికి కారణం. షూటింగ్స్ లేని సమయంలో మేకప్ వేసుకోను. బయటకు వెళ్తే.. కాటుక, లిప్‌స్టిక్ మాత్రమే ఉపయోగిస్తాను. సెల్ఫీలకు, ఫోటోలకు ఫిల్టర్స్ వాడటం ఇష్టం ఉండదు. షూటింగ్ ముగించుకొని వచ్చాక రాత్రి నిద్రపోయేప్పుడు తప్పనిసరిగా మేకప్ తీసేస్తా. ఎంత అలసిపోయినా సరే ఈ విషయాన్ని మాత్రం మర్చిపోను. నా చర్మం హెల్తీగా ఉండడానికి ఇంట్లో తయారు చేసిన ఆయిల్స్ రాసుకోవడమే కారణం’ అంటూ చెప్పుకొచ్చిందీ అందాల తార.
View this post on Instagram
Pooja Hegde: అప్పుడే ఆ విషయం అర్థమైంది.. వేదాంతం వల్లించిన బుట్ట బొమ్మ..
COVID Vaccination: వేగవంతంగా వ్యాక్సినేషన్.. కోవిడ్ రక్కసికి చెక్ పెట్టిన మోడీ సర్కార్ వ్యూహం..